స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
నొకటి గీచి దానికి ప్రాణం పోశాడా అంటాడు దుష్యంతుడు. ఉన్మీలితం తూలిక యేవ చిత్రం. ఈ పార్వతీ దేవి నవ నవలాడే ఈ దేహ యష్టి చక్కని కుంచెతో నిర్మించిన ఒక చిత్ర పటమా అని భావిస్తాడు కవి. అజమ హారాజంత బాధ నెలా తట్టుకో గలిగాడో తెలుసా మీకు. పగలా ఇందుమతి చిత్రపటాలు చూస్తూ - రాత్రులావిడ స్వప్నంలో సాక్షాత్కరిస్తే చూస్తూ- కాలం గడిపాడట. చిత్ర పటాలు గీయటమూ అవి గోడల మీద అలంకరించటమో అప్పటి కాకాలంలోనే ఉందన్న మాట. ఇక ఈ చిత్రానికి సహోదరమైన శిల్పకళ ఉండనే ఉంది. అసలు చిత్రమేమంటే చిత్రమే కదిలితే నాట్య కళ. కదలకుంటే శిల్ప కళ. మాళవిక నలాగే వర్ణిస్తాడు కవి రెండు పద్యాలలో. అద్భుతమైన పద్యాలవి. చిరస్మరణీయాలు. పునః పునరను సంధానాత్మాకాలు. ఒకటి ఆవిడ నాట్యమాడే సోయగాన్ని చూపితే ఇంకొకటి ఆడి ఆడి ఆవిడ ఒకభంగిమలో నిలుచున్న దృశ్యాన్ని చూపుతుంది. అప్పుడా మూర్తి నిజంగా ఒక శిల్ప ఖండమే నని తోస్తుంది కవి వర్ణించిన తీరు చూస్తే.
అసలా మాటకు వస్తే నాట్య కళ ఒక్కటే చాలు. సకల కళలకు ఆల వాల మది. అందులో చలన మున్నది. నిలకడ ఉన్నది. చలించిన పుడది నాట్యం నిలిచి నప్పుడు శిల్పం. చిత్రం. తత్తద్భావ రేఖల నభినయించే టపుడది సాహిత్యం. దానికి ప్రేరక మైన నేపథ్య గానం సంగీతం. అందుకే నేమో నాట్యం భిన్న రుచే ర్జనస్య బహుధా ప్యేకం సమారాధనం. భిన్న రుచులున్న ఎవరికే గాని అభిన్నమైన ఆకర్షణ నాట్య మేనట. ఇంకా ఒక సూక్ష్మ ముంది ఇందులో. శబ్ద మర్థ మివి రెండే ఉన్నది స్పష్టిలో. భౌతిక సృష్టిలో అవే. కళా సృష్టిలోనూ అవే. భౌతిక సృష్టిలో అవి నామ రూపా అయితే కళా సృష్టిలో శబ్దార్థాలు. ఇందులో శబ్ద భాగాన్ని సంగీత సాహిత్యాలు పంచుకొంటే అర్థ భాగాన్ని నాట్య శిల్ప చిత్రాలు పంచుకొన్నాయి. అవి మరలా దేని పాటికవి తెగదెంపులు చేసుకొన్నవి కావు. ప్రధానోప సర్జన భావమే ఇక్కడ
Page 11