#


Back

   దానితో అసలుపనిషత్తాత్పర్య Import మేమిటో ఎవరికీ అంతు పట్టకుండా మరగున బడిపోయింది. అలాంటి పరిస్థితిలో అవతరించారు శంకర భగవత్పాదులు. అలా అవతరించి పరస్పర విరుద్ధంగా కనపడే భావాలనన్నిటినీ సమన్వయించి ఉపనిషత్తులన్నిటికీ కలిపి ఒక్క అద్వైతమే వివక్షిత Intention మని ఆయన సిద్ధాంతం చేశారు.

   ఇది ఒక్క ఉపనిషత్తులకేగాదు. ఆ మాటకు వస్తే శ్రుతులకన్నింటికీ కూడా అద్వైతమే పరాయణమని ఆయన చేసిన తీర్మానం. ఋగ్యజుస్సా మాథర్వణాలనే నాలుగు శ్రుతులూ ఒక జ్ఞానకాండనే గాక విధ్యుపాసన రూపమైన కర్మకాండను గూడా ప్రతిపాదిస్తాయి. ఇందులో జ్ఞానకాండ అనబడే ఉపనిషత్తులొక వేళ అద్వైత భావాని కనుకూలమైనా కర్మకాండ మాత్రమలా అయినట్టు కనిపించదు. కర్మ అనేది దాని స్వరూపాన్ని బట్టి చూచినా అది ఇచ్చే స్వర్గాది ఫలాన్ని బట్టి చూచినా కేవల మీద్వైత ప్రపంచంతోనే ముడిబడి ఉన్నట్టు తోస్తుంది. కానీ చిత్రమేమంటే ఆ కర్మలు కూడా కామ్యవర్జితంగా ఆచరిస్తే చాలు. మానవుడికి చిత్తశుద్ధిని ప్రసాదించి తద్వారా జ్ఞానోత్పత్తికే దోహదం చేస్తాయి. అప్పటి కుపనిషత్తులు సాక్షాత్తుగా Direct నైతే కర్మోపాసనలు రెండూ పరంపరగా Indirect సాధనాలవుతాయి అద్వైతానికి, దీనిని బట్టి కాండద్వయాత్మకమైన శ్రుతికంతటికీ అద్వైతమే పరమార్ధమని ఏక వాక్యతను Uniformity నిరూపించారు శంకరులు.

   శ్రుతులకు నిరూపించ గలిగారంటే ఆ శ్రుతుల అడుగుజాడలలో పయనించేవే మను యాజ్ఞవల్క్యాది స్మృతులు కూడా. కాబట్టి వాటికి కూడా నిరూపించి నట్టయింది. పోతే ఈ శ్రుతి స్మృతులలోని భావాలనే కథా రూపంగా బయట పెడతాయి ఇతిహాస పురాణాలు. కనుక వాటికి కూడా ఇదే తాత్పర్యమని చాటినట్టయింది. మొత్తంమీద శ్రుతి స్మృతి పురాణేతి హాసభేద భిన్నమైన సమస్త వాఙ్మయానికీ అద్వైత జ్ఞానమొక్కటే చివరకు పరాయణమని ఆయన చేసిన సమన్వయం.

   మరి ఈ సమన్వయ ప్రయత్నమింతటితో ఆగలేదు. శాస్త్ర ప్రమాణాన్నే గాక లౌకికమైన ప్రత్యక్షాదులను కూడా ఆయన దాని పరిధిలోకే లాగ గలిగారు. అది మరీ అద్భుతం. "అహం బ్రహ్మాస్మి - ఇత్యేద దవ సానా ఏవ సర్వే విధయః సర్వాణిచ ప్రమాణాని" అని ఆచార్యులవారు సెలవిచ్చిన వాక్యం. అహమ్ బ్రహ్మాస్మి అనే అఖండాత్మ భావంతో సమాప్తమయ్యేవే సకల కర్మలూ, సర్వ ప్రమాణాలూ. సర్వ ప్రమాణాలూ అన్నప్పుడొక వాఙ్మయ జగత్తే Litarary World గాదు.

Page 9