#


Back

   మిగతా వారంతా పరమానందయ్య శిష్యులే. తమకు లేనిదంతా ఉన్నదని ఆపాదించుకొనేవారే. మహా అయితే వారికి శ్రవణ Learning ముందేమో గాని మననం Reflection లేదు. మననం కూడా ఉంటుందేమో గాని నిదిధ్యాసన Dedication మనేది అసలుండదు. నిదిధ్యాసన లేదంటే అది అనుభవమే గాదు. అనుభవం లేకున్నా ఉన్నట్టు నటించే వారి నాచార్యుల వారు క్షమించరు.

   “అస్మదీయాశ్చకేచిత్” మా వాళ్లు కూడా కొందరీ బాపతు వారున్నారని గట్టిగా చీవాట్లు పెట్టారాయన. ఇలాటి వైపరీత్యాని కంతటికీ కారణమొక్కటే. జ్ఞానమనేది కలగకముందే తొందరపడి కర్మానుష్ఠానమంతా వ్యావహారికమని చెప్పి దానికి తిలాంజలి ఇవ్వటం. అది ఎంత వ్యావహారికమైనా సరియైన అద్వైత జ్ఞానముదయించ నంతవరకూ దానిని మనం మానరాదు. జ్ఞాన ప్రతిబంధకమైన పాపకర్మ ఎంతో ఉంటుంది జీవులకు. సైంధవుడిలాగా అది అడ్డు తగులుతుంది మనకు మోక్షమార్గంలో అది అడ్డమున్నంతవరకూ జ్ఞానానికి ప్రవేశం లేదు. ఈ అడ్డంకి మనం తొలగించు కోవాలంటే మొదట శాస్త్ర చోదితమైన సత్కర్మలనుష్ఠించవలసిందే. అయితే ఫలాభినంధి Desire for good results లేకుండా అనుసరించాలి వాటిని. అలా ఆచరిస్తే సత్త్వం Mental set up బాగా శుద్ధి అయి అది జ్ఞానానికి దోహదం చేస్తుంది. అంచేత పారమార్థికం ఒంటబట్టే వరకూ వ్యవహారికాన్ని మనం సాగించవలసిందే. వదలుకోరాదు. వదలుకొంటే మన మపేక్షించే మోక్షఫలం మన చేతికి వచ్చే మార్గమే మనకు కరువయి పోతుందని వేదాంతులను కూడా హెచ్చరించారాయన. కాబట్టి పారమార్థికమే చివరకు వాంఛనీయమైనా అది మనకు పట్టుపడే వరకూ వ్యావహారికాన్ని పాటించవలసిందే. అది గమ్యమైతే End ఇది దానికి గమకం Means

.

   ఇంతవరకూ సాగిన ఈ చర్చకంతటికీ ఏమిటి పిండితార్ధమని ఇప్పుడు ప్రశ్న. నిత్యమూ ఉన్నదొక్క పారమార్థిక సత్యమే అయినా అదే మన అజ్ఞానదృష్టి కనేక రూపాలుగా భాసిస్తున్నది. భాసిస్తున్న నేరానికా మేరకు దానిని మనం వ్యావహారిక సత్యమని పేర్కొనవలసి వచ్చింది. పోతే ఈ వ్యావహారికమనేది దాని పాటికది ఊరక ఉంటే చక్కగా ఉండేది. కాని మనకది ఎక్కడ లేని ఉపద్రవాలు తెచ్చి పెడుతున్నది.

Page 77