ప్రస్తుత మీ వేదాంతమనేది అన్నిటికన్నా ప్రబలమైన ప్రమాణమని గదా వర్ణించాము. అలాంటప్పుడది మనకు జ్ఞానాన్ని ప్రసాదించకపోగా మిథ్యా జ్ఞానాన్ని బలపరిస్తే ఎలాగ. వ్యావహారికం కూడా సత్యమని ప్రతిపాదిస్తే అలా బలపరిచినట్టే అవుతుంది. అయితే మరి ఎందుకు వర్ణించినట్టీ వ్యావహారికాన్ని అది దాన్ని ప్రతిపాదించటానికి గాదు. నిజంలో దాన్ని ప్రతిషేధించటానికేనని వ్యాఖ్యనించారు భాష్యకారులు. శాస్త్రం మొదట వ్యావహారిక సత్యమంటూ ఎంతో చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తుంది. సందేహం లేదు. కాని అదే సర్వస్వమని చెప్పి చివరదాకా అందులోనే కూచోమని చెప్పటానికి గాదా వర్ణన. అది నీవు సత్యమని చూస్తున్నావు. కాని విచారిస్తే ఇది సత్యం కాదు. సత్యంగా ఉన్నదొక్క బ్రహ్మచైతన్యమే సుమా. అదే నీ దృగ్గోషంవల్ల నీకీ రూపంలో గోచరిస్తున్నది. కాబట్టి నీవీ రూపంగా దీనిని చూడటం మానుకొని ఆ చైతన్య రూపంగానే దర్శించు అదే పరమార్ధం అని చాటటానికి.
అంటే అప్పటికీ కలాపాన్నంతటినీ మన మాపరమార్ధాన్ని చేరటానికొక ఆలంబనంగా Support ఒక సాధనంగా Means తీసుకోవలసిందే గాని దానికొక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కల్పించుకొని అది కూడా జీవిత పరమార్ధమని భావించరాదన్న మాట. ఆలంబనమనేది సత్యమైన పదార్థాన్ని చేర్చేంతవరకే. ఆ తరువాత దానికస్తిత్వం లేదు. ఆ పదార్థంలోనే లీనమై పోతుందది. అలాగే ప్రస్తుత మీ వ్యావహారికమైన సృష్టి అంతా అద్వితీయమైన బ్రహ్మతత్త్వాన్ని ఆకళించుకొనే వరకే. ఆ తరువాత దీనికీ అస్తిత్వం లేదు. సృష్టి అసలు జరగకపోయినా జరిగిందని వర్ణించటమిందు కోసమే. ఇదే వ్యావహారికమనే ఒక విభాగాన్ని ఆచార్యులవారు ప్రదర్శించటంలో కూడా అంతరార్ధం.
ఇది అర్థం గాక ఇటు లోకులు, అటు పండితులూ కూడా నూటికి తొంభయి మంది వేదాంత మార్గంలో ఊరక బోల్తాపడుతున్నారు. గమకాన్నే Means గమ్య End మనీ సంకేతాన్నే Symbol సత్యమనీ Truth అపోహపడుతున్నారు వీరంతా. అంచేతనే యావజ్జీవమూ ఏ మంత్రమో తంత్రమో విగ్రహమో విధానమో పట్టుకొని అదే ఉద్దరిస్తుంది, అంతకన్నా మరేమీ లేదని అక్కడికే నిలిచిపోతున్నారు.
Page 75