అది మరలా వాటిలాగా సూక్ష్మమైతే సుఖం లేదు. స్థూలమైన బాహ్యజగత్తుతో సంబంధం పెట్టుకోవాలంటే స్థూలమైన కవచమే ఒకటి తయారుకావాలి. లేకుంటే అవి ఒకచోట నిలవలేవు. పని చేయలేవు.
ఇలాంటి ఒక కవచమే అన్నమయమైన ఈ స్థూల శరీరం. ఛాందోగ్యం చాటినట్టుగా ఇది అన్నంలోపుట్టి అన్నంతో పెరుగుతున్నది. చివర కన్నంలోనే లయమవుతుంది. అన్నమంటే ఏదోగాదు. పృథివీ తత్త్వమే. కనుకనే స్థూలమంతా అన్నమయమన్నాము. ఈఅన్న ప్రభావంవల్లనే ప్రాణమనో విజ్ఞానాలు దెబ్బ తినకుండ పని చేస్తున్నాయి. బ్రతకగలుగుతున్నాయి. పోతే వీటికిమూలమైన కామమనేది ఫలిస్తే చాలు. అది అవిద్యారూపమైన ఆనందానికి దోహదం చేస్తున్నది. అంచేత వేదాంతులు చెప్పే పంచకోశాలు కూడా ఈ శరీర త్రయంలోనే కలిసి వస్తాయి మనకు. అన్నమయ కోశం స్థూలమైతే ప్రాణ మనోవిజ్ఞాన మయాలనే కోశాలు మూడు సూక్ష్మమైతే అయిదవదైన ఆనందమయకోశమే అవిద్యా రూపమైన కారణ శరీరం.
ఏతావతా ఈ శరీర త్రయ నిర్మాణంతో చైతన్యం తాలూకు అవరోహణ యాత్ర సమాప్తమయింది. అనాది సిద్ధమైన అవిద్యే లేకుంటే శుద్ధమైన చైతన్యం కదలకుండా అలాగే ఉండేది. అచ్యుతం చ్యుతం కావలసిన అగత్యం లేదు. కాని ఉన్నట్టుండి అవిద్య అనే కారణ శరీరమొకటిచుట్టుకొనే సరికది చ్యుతమై కామనకు Desire లోనయింది. కామమనే ఈ సూక్ష్మశరీరం క్రమంగా స్థూలీభవించి తద్వారా బాహ్యమైన లోకంతో చైతన్యానికి లావాదేవీ ఏర్పడింది. ఈ లావాదేవినే కర్మ అని పేర్కొంటున్నాము. ఇందులో కర్మ భూమి జగత్తయితే కర్మ కర్త జీవుడు. జీవుడంటే సూక్ష్మ శరీరోప హితమైన చైతన్యాంశమే నని గదా చెప్పాము. అది అలా ఉపహితం Veiled కావటానికేమిటి కారణం. ఉపహితమంటే నిజంలో కాకపోయినా అయినట్టు భాసించటమే గదా. అలాంటి దానికి కారణమేమయి ఉంటుంది. అవిద్య తప్పితే.
ఈ అవిద్యా పిశాచం ఒక పిండాండస్థాయి Micro cosmic లోనే గాదు. బ్రహ్మాండ స్థాయి Macro cosmic లో కూడా పని చేస్తుంది. తన్మూలంగా అక్కడాకూడా కారణమనీ, సూక్ష్మమనీ, స్థూలమనీ మూడు శరీరాలూ యధోచితంగా ఆవిర్భవించాయి.
Page 63