ఆ ముందనేది ఆలోచిస్తూ పోతే ఎంత ముందుకైనా పోతుంది కాలంలో. కనుకనే అజ్ఞానానికాది లేదని చెప్పటం, బ్రహ్మ పదార్థంలాగా అది కూడా అనాది సిద్ధమే. అయితే బ్రహ్మమనేది అనంతం Infinite కూడా. ఇది అనాదేగాని సొంతమైన Finite పదార్థం.
అనాది సిద్ధమైన అజ్ఞానాన్నే అవిద్య Nescience or Illusion అని కూడా వ్యవహరిస్తారు వేదాంతులు. జీవజగత్తులనేవి ఏర్పడటానికీ అవిద్యే మూలకారణం. కనుకనే వేదాంతంలో దీనికి కారణ శరీర Causal Body మని పేరు వచ్చింది. శరీరమనగానే కరచరణాద్యవయవాలే ఉండనక్కరలేదు. వస్తుస్వరూపాన్ని కప్పి పుచ్చేది ఏదైనా అది ఒక శరీరమే Cover. ప్రస్తుత మీ అవిద్య అనేది చైతన్య ప్రకాశాన్ని ఒక నీడలాగా కప్పి పుచ్చుతున్నది. కప్పిపుచ్చే సరికఖండమైన ఆ చైతన్య మా మేరకు పరిచ్ఛిన్నమై పోయింది. ఆ పరిచ్చిన్నమైన చైతన్యభాగమే జీవుడని పేర్కొన్నాము. అప్పటిక విద్యవల్ల ఏర్పడిందే జీవభావం. ఈ అవిద్య అనే ఆవరణమే పని చేయకపోతే పరిపూర్ణ బ్రహ్మ స్వరూపులమనే జ్ఞానమే మనకుండేది. ఏదీ అది మనకెక్కడ ఉందిప్పుడు. మీదు మిక్కిలి కేవలమొక అల్పజ్ఞుడైన జీవుడనే భావమే ఉంది మనకు. ఇలాంటి భావం మనకుండటమే చాలు జీవుడవిద్యా కార్యమని చెప్పటానికి తార్కాణం.
జీవుడిలాగా జగత్తుకూడా అవిద్యాకార్యమే. అవిద్య అనే దానికి రెండు శక్తులున్నాయి. ఒకటి ఆవరణ శక్తి Contraction మరొకటి విక్షేపశక్తి Distraction ఇందులో ఆవరణ శక్తి జీవభావానికి దారితీస్తే విక్షేపమనేది జగద్భావానికి దారి తీస్తుంది. చైతన్యం పరిచ్ఛిన్నమయి గదా జీవుడయిందని చెప్పాము. పరిచ్ఛిన్నమైన భాగం పోగ మిగతా చైతన్యభాగమంతా ఏమయినట్టు. విక్షేపశక్తి పని చేసి దాన్ని చైతన్యానికి విలక్షణంగా చూపుతున్నది. చైతన్యానికి విలక్షణ మచేతనమే గదా. అదే ఈ పాంచ భౌతికమైన జడ ప్రపంచం. ఒక విధంగా చెబితే అవిద్య అనేది సత్యాన్ని మరుగు పరుస్తున్నది. అసత్యాన్ని బయట పెడుతున్నది. ఆవరణ ముఖంతో అది సత్యాన్ని మరుగు పరిస్తే విక్షేప ముఖంతో అసత్యాన్ని బయట పెడుతుంది. ఆవరణం వల్ల జీవ భావమేర్పడితే విక్షేపం వల్ల జగద్భావ మేర్పడింది. రెంటికీ అవిద్యే కారణం కాబట్టి దానికి కారణ శరీరమనే పేరు సార్థకమయింది.
ఈ కారణ శరీరమింతటితో నిలవలేదు. అది సూక్ష్మశరీర Subtle Body మనే మరి ఒక శరీరాన్ని సృష్టించింది. అవిద్య మూలంగా జీవజగత్తు లేర్పడ్డాయని గదా ఇంతకు ముందు మనం పేర్కొన్నది.
Page 61