అయితే ఈ సత్యాన్ని మనమింకా గుర్తించలేదంత మాత్రమే. గుర్తించలేక ఉపాధులే నేనని భ్రమించాము. దాని మూలంగా మనం జీవులమని భావించి మన కతీతంగా ఈశ్వరుడనే ఒక భావాన్ని కల్పించుకొన్నాము.
వాస్తవంలో ఈ శరీరాద్యుపాధులన్నింటినీ ప్రవిలయం Dissolve చేసుకొని చూస్తే
చాలు. మనమే ఆ ఈశ్వరుడని అనుభవానికి వస్తుంది. వస్తే ఇక ఈ సృష్టి ఏమిటి
ఎవరు చేశారు. ఎందుకిలా ఉంది. అనే ప్రశ్నే లేదు. ఎంచేతనంటే అప్పుడిక
మనకు భిన్నంగా ప్రపంచమూ లేదు, జీవుడూ లేడు, దేవుడూ లేడు. బ్రహ్మ చైతన్యానికి
బాహ్యంగా మరి ఏ భావమూ Entity లేదని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడెవరి
నడగాలి మన మీ ప్రశ్న. మనమే బ్రహ్మమయినప్పుడిక ప్రశ్న ఏముంది. దీనిని
బట్టి ప్రపంచ సృష్టి అనేది అసలెప్పుడూ జరగనే లేదని మనకు బోధ పడుతుంది.
ఒకే ఒక ఆత్మ తప్ప మరేదీ లేదన్నప్పుడిక సృష్టి అనే దాని కాస్కారమే లేదు గదా.
అయితే మనకిలాంటి ప్రశ్న లెందుకుదయిస్తున్నాయని ప్రశ్న. మన అజ్ఞానం వల్లనే
ఉదయిస్తున్నా యంటారు ఆచార్యులవారు. ఎందుకంటే మనకు జ్ఞానమనేదే ఉంటే
జీవ జగదీశ్వరులనే త్రిపుటి కరగిపోయి అంతా ఆత్మ స్వరూపంగానే భాసించేది.
అందుకు నోచుకోకపోవటం వల్లనే ఈ ప్రశ్నలన్నీ. మనమొక జీవులమనీ, మనకు
నియంత ఒక ఈశ్వరుడున్నాడనీ వాడు చేసిన ఈ విషమమైన సృష్టి మూలంగా
మనమిలా కష్టపడుతున్నామనీ ఇదంతా మన అజ్ఞాన కల్పితమే. కల్పితం సత్యమెలా
అవుతుంది కనుకనే అసలు జరగనే లేదీ సృష్టి అని చెప్పటం. దీనినే అజాతవాదమని
పేర్కొన్నారద్వైతులు. మరి జరగకున్నా కనిపిస్తున్నదే అంటే అబద్ధమే. ఒకటి
ఏర్పడకుండానే ఎలా కనిపిస్తుంది. అయినా కనిపించిందంటే అది మన కనిపించిన
మేరకే ఉంది గాని వాస్తవంలో లేదు. దీనికే దృష్టి సృష్టి వాదమని పేరు పెట్టారు వారు.
ఇంతకూ సృష్టి అని ఏది పేర్కొంటున్నామో వాస్తవానికది ఈశ్వర సృష్టి కాదు. అంతా జీవసృష్టే. కాబట్టి ఈ సృష్టిలోని లోటుపాట్లకు వేటికీ ఆయన జవాబుదారు కాడు. లేకున్నా ఉన్నదని దర్శించి ఊరక బెదిరిపోయే మానవుడి అజ్ఞానమే దానికి జవాబుదారు. అజ్ఞానమే గాక వస్తు స్వభావం కూడా ఉంది గదా అని అడగవచ్చు. నిజమే. నీవు వస్తువని పేర్కొనేవా డీశ్వరుడే గదా. వాడు కూడా వాస్తవంలో నీకు భిన్నంగా ఎక్కడా లేడు. నీకున్న అజ్ఞానం వల్లనే వాడెక్కడో ఒకడున్నట్టు ఊహించావు. వాడు తన మాయాశక్తి మూలంగా ఈ సృష్టినంతా చేస్తున్నట్టు భావించావు. కాబట్టి వస్తు స్వభావమని చెప్పినా అదీ మన అజ్ఞాన కల్పితమే. దాని విజృంభణమే. మరేదీ.
Page 59