శాస్త్రానికి శాస్త్రమైన వేదాంతాన్ని బట్టి విచారణ చేయగా సత్యంగా ఉన్నదొక్క ఈశ్వర చైతన్యమేనని దానికి భిన్నంగా సృష్టిలో మరేదీ లేదని స్పష్టమయింది. జీవజగత్తులు భిన్నంగా కనిపిస్తున్నా అది అవిచార మూలకమే కాబట్టి కేవలం మిథ్యాభూతమేనని కూడా ఋజవయింది. అలాగే సత్యమైన ఆ చైతన్యం మనకెక్కడా గోచరించటం లేదంటే అది సాక్షాత్తూ మన ఆత్మ స్వరూపమే కాబట్టి నిత్యమూ అనుభవానికి వస్తూనే ఉందని కూడా నిరూపణ అయింది. మొత్తం మీద అఖండమైన ఆత్మ చైతన్యమొక్కటే ఉంది సృష్టిలో. మరొకటేదీ లేదు. జీవుడూ లేడు- జగత్తూ లేదు. ఉందని చెప్పినా అది కేవలం మిథ్యాభూతమే. ఎంత లేదని వాదించినా ఇది ఎప్పటికీ సత్యమేనని సారాంశం.
Page 49