ఇలాంటి శరీర బంధం కూడా లేక సర్వతో వ్యాప్తమైనదేదో అది ముక్తం. భాష్యకారులు చేసిన ఉపనిషత్తులు చేసినవర్ణనకు ప్రతిధ్వని రూపమే. తైత్తిరీయమనే ఉపనిషత్తిలా వర్ణిస్తుంది. “సత్యమ్-జ్ఞానమ్-అనంతమ్-బ్రహ్మ” సత్యమూ జ్ఞానమూ అనంతమూ అయినదేదో అదే ఆ ఈశ్వర స్వరూపం. సత్యమంటే ఏమిటి. ఏ రూపంలో ఏది నిశ్చయిస్తామో ఆ రూపాన్ని వ్యభిచరించకపోతే అది సత్యం. వ్యభిచరిస్తే అనృతం. అనృతానికే వికారమని గూడా పేరు. "వాచారం భణమ్ వికారో నామ ధేయమ్” వికారమనేది కేవలం కనిపిస్తున్నదనే మాటేగాని "మృత్తికే త్యేవ సత్యమ్” మృత్తిక అనేదొక్కటే సత్యమన్నారు. దీనిని బట్టి సద్రూపమైన తత్త్వమే మిగతా వికారరూపమైన జగత్తుకంతా కారణమని చెప్పినట్టయింది. కారణమనే సరి కది మృత్తికలాగా ఒక జడ పదార్ధమేమోనని మరలా మనకు భ్రాంతి కలగవచ్చు. అంచేత దానిని జ్ఞానమని కూడా వర్ణించిందుపనిషత్తు. సత్యమేకాక అది జ్ఞానంకూడా. దీని మూలంగా అది ఒక మృత్తిక మాది రచేతనంకాదు చేతనమైన తత్త్వమని చాటి నట్టయింది. జ్ఞానమనేసరికి దానికి జ్ఞేయ Object of Knowledge మేమిటని మరలా ప్రశ్న రావచ్చు. ప్రతి జ్ఞానానికీ ఒక జ్ఞేయమనేది ఉండి తీరుతుంది. జ్ఞేయమంటే జ్ఞానానికి గోచరించే పదార్ధమే గదా. ఏదో ఒక పదార్థం గోచరిస్తుంటేనే జ్ఞానమనేది దాన్ని గ్రహిస్తుంటుంది. ఏదీ గోచరించకపోతే దేనినని గ్రహిస్తుందది. గ్రహించకపోతే అది జ్ఞానమెలా అవుతుందని ప్రశ్న. దీనికి సమాధానమే అనంతమనే మూడవ మాట. అంతం లేనిదేదో అది అనంతం. అంతమంటే ఏమిటి. ఒక పదార్ధానికి విజాతీయమైన పదార్థమెక్కడ ఏర్పడుతుందో అక్కడికది అంతం. ప్రస్తుతం జ్ఞానానికి విజాతీయమంటూ ఏదీలేదు. ఏదైనా ఉన్నట్టు కనిపిస్తే అది ఈ జీవజగత్తులు రెండే. జగత్తు కార్యం కాబట్టి దానికి భిన్నంకాదని ఇంతకుముందే నిరూపించాము. పోతే జీవుడు కేవలం చేతనుడే కాబట్టి దానికి విలక్షణంగా
ఎప్పుడూ లేడు. రెండూ దానికి విజాతీయం కాకపోతే ఇక దానికంత మేముంది. అందుకే దాని ననంతమన్నారు.
సత్యం జ్ఞానమనంతమనే మూడు లక్షణాలూ కలియబోసుకొని చూస్తే చివరకది తప్ప మరి ఒక పదార్ధమేదీ లేదని బోధపడుతున్నది. ఏదీ లేకపోతే దానికిక ఈశ్వరుడనే పేరుకూడా చెల్లదు. ఈశితవ్య Commandable మైన పదార్ధముంటేనే ఈశ్వరుడు Master.
Page 42