ఇలాంటి ఒక అంశమే జీవుడు కూడా ఈశ్వర చైతన్యంలో పరిచ్ఛిన్నమని చెప్పామంటేనే ఇక అది అంశం కాక తప్పదు.
అయితే ఒక చిన్న ఆశంక. చైతన్యమనేది ఒక దావానలం లాగా, సముద్రం లాగా, సావయవమైన పదార్థం కాదు. అది నిరవయవమైన తత్త్వం. అలాంటి దానిలో జీవుడనే అంశమెలా ఏర్పడింది. నిజమే. ఏర్పడటానికెంత మాత్రమూ వీలు లేదు. కానీ జగత్తనే కార్యమొకటి వస్తుతః దానికి భిన్నంగా లేకపోయినా ఉన్నట్టు భాసించటం లేదా. అలాగే నిరంశమైన చైతన్యంలో జీవుడనే అంశం కూడా ఒక ఆభాసే గాని వాస్తవం కాదు. వాస్తవం కాకుండా ఎలా భాసించగలిగింది. దానికి కారణ మాయా ఉపాధుల తోడి సంసర్గమే నన్నారు జగద్గురువులు. ఉపాధి ఏమిటని అడగవచ్చు. సహజంగా లేక మధ్యలో వచ్చి సంక్రమించేదేదో అది ఉపాధి Accessory. సహజం కాదు కనుకనే అది వస్తుధర్మం కాదు. వస్తుధర్మం కాకపోయినా అది వస్తువు నాకర్షిస్తుంది. తన గుప్పిటిలో ఇరికించు కొంటుంది. తనమేరకే దాన్ని కుంచించి చూపుతుంది.
ఈ రహస్యం తార్కాణ కావాలంటే మనమొక అద్దాన్ని తీసుకొని చూడవచ్చు. అద్దమనేది ఒక ఉపాధి. అందులో తొంగి చూస్తే మనకు మన ముఖం కనిపిస్తుంది. ఇప్పుడా కనిపించే ప్రతి ముఖమెక్కడిది. మన ముఖమేనా. కాదు. మనముఖం మన దగ్గరే ఉంది. అది అద్దం పగల గొట్టుకొని పోయి అందులో ప్రవేశించలేదు. మరిఏమిటది. ఎక్కడి నుంచి వచ్చింది. ఎక్కడి నుంచీ రాలేదు. అది ఒక ఆభాస. మన వద్ద ఉన్న ముఖమే అద్దంలో ఉన్నట్టు భాసిస్తున్నది. అంచేత అది మన ముఖంకన్నా భిన్నం కాదు. అలాగే ప్రస్తుత మీ శరీరాది సంఘాతం కూడా మన కద్దంలాంటి ఒక ఉపాధి. అఖండమైన చైతన్యం మన ముఖంలాగానే ఇందులో వచ్చి ప్రతిఫలించింది. ప్రతిఫలించి దాని మేరకే నిలిచి పోయింది. ఇలా నిలిచిపోయిన చైతన్య ఖండాన్నే మనమిప్పుడు జీవుడని పేర్కొంటున్నాము. ఇది కేవల మా బింబానికి ప్రతిబింబమే. ప్రతిబింబ మనేది దాని బింబానికెలా వ్యతిరిక్తం కాదో అలాగే ఈ జీవ చైతన్యం కూడా ఆ మహా చైతన్యానికి వ్యతిరిక్తం కాదనే గ్రహించాలి మనం.
అయితే బింబమూ-ప్రతిబింబ మంటే అవి మూర్తమైన పదార్థాలు కాబట్టి ఒక ఉపాధిలో ప్రవేశించటాని కక్కడ ఆస్కారముంది.
Page 34