ప్రపంచమే ముందని కొందరి మతమైతే దాన్ని గ్రహించే జ్ఞానమేముందని కొందరిమతం. మొదటివారికి భౌతికవాదులనీ Materialists రెండవవారికి భావవాదులనీ Idealists పేరు వచ్చింది. ఎవరి వాదానికి తగిన ఉపపత్తులు వారు చూపుతూ రావటంవల్ల ఏదీ ఇదమిత్థమని తేలటం లేదు. కానీ శంకరులీ గడ్డయిన సమస్యనుకూడా అవలీలగా పరిష్కరించారు. ఆయన భౌతిక వాదం తప్పు-భావవాదమే సరియైనదని తేల్చివేశారు. అది ఎలాగని అడిగితే ఆయన చెప్పే సమాధానమిది.
ప్రపంచమనేది మనకెప్పుడూ జ్ఞేయంగా As Known భాసించవలసిందే గాని పదార్థంగా As Thing దాని కస్తిత్వం లేదు. జ్ఞానపరిధిలోకి వచ్చినప్పుడే దాన్ని ఉందని తెలుసుకోగలుగుతున్నాము. ఆ పరిధి దాటిందంటే అది అసలు ఉందో లేదో మనకు తెలియదు. మనకు తెలియకపోతే నేమి. దానిపాటి కది ఉండవచ్చుగదా అని వాదించరాదు. దానిపాటికది ఉంటుందని చెబుతున్నది కూడా ఎవరు. నీవేగదా. చెబితే అది నీకు మరలా జ్ఞేయ Object of knowledge మయి కూచుంటుంది. కాబట్టి దానిపాటికది ఉండాలంటే ఉందని నీ వనటం గాదు. అది అనుకోగలిగిందో అప్పుడది జ్ఞానమే అవుతుంది. కాని నీకు జ్ఞేయం కాలేదు. కానీ నీకెప్పుడూ అది జ్ఞేయమే అవుతూ ఉన్నది జీవితంలో. కాబట్టి నీ మాదిరి అనుకొనే జ్ఞానం దానికి లేదు. మరి జ్ఞానమున్న నీవూ అనుకోక జ్ఞానం లేని తానూ అనుకోకపోతే ఇక ఉందని వాదిస్తున్నావే ఆ ఉనికి ఎవరిది. తల్లిదండ్రులిద్దరూ వదిలేసిన బిడ్డలాగా అనాథ అయిపోయిందా ఉనికి. ఉనికి అనేది ఒక ధర్మం. దానికొక ఆశ్రయమనేది ఉండి తీరాలి. అది దాన్ని గమనించే చైతన్యమే తప్ప మరొకటి కావటానికి లేదు. కనుకనే ప్రపంచానికి ప్రపంచంగా అస్తిత్వం లేదు. జ్ఞేయంగానే దాని కస్తిత్వమని చెప్పటం. ఒక జ్ఞానమనేది ముందుగా సిద్ధమయి ఉంటేనే దానికది గోచరిస్తూ బ్రతుకుతున్నదనటంలో సందేహంలేదు.
అయితే జ్ఞానమనే సరికది ప్రస్తుతం మనకున్న జ్ఞానంలాంటిదేననే ఆశంక కలగవచ్చు, మనలో ప్రతిఒక్కరికీ. జ్ఞానముందనే విషయం మన కనుభవ సిద్దమే. అలా ఉండటం మూలాన్నే ప్రతిక్షణమూ మన మీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాము. అలాంటప్పుడు ప్రపంచం జ్ఞానానికి గోచరిస్తుందంటే అది మనజ్ఞానానికేనని భావించటంలో ఆశ్చర్యంలేదు.
Page 24