#


Back

   అంచేత లోకోపకారార్ధం మేము వాటిని నిస్సారమని చాటవలసి వస్తున్నది. అంతేగాని మాకు వారిమీద ఎలాటి ద్వేష భావమూ ఉండి గాదు.

   ఆ మాటకు వస్తే రాగద్వేషాలు మాకుకాదు. భేదవాదులైన మిగతా మతాచార్యులకే ఉన్నాయని ప్రతివాదుల మీదనే అభియోగం మోపారాయన. అద్వైతులు తప్ప మిగతా సాంఖ్య యోగవై శేషికనై యాయి కాదులంతా భేదవాదులే. భేదవాదు లోకరి వాదాన్ని ఒక రంగీకరించరు. ఎవరిది వారు సత్యమని చెప్పి ఇతరులను తప్పు పడతారు. రోషాలు పెంచుకొని ఒకరి నొకరు ద్వేషిస్తారు. అలా ద్వేషించవలసిన అగత్యం మాకులేదు. మేమనన్య వాదులమైన అద్వైతులం. శరీరంలో కరచరణా ద్యవయవాల లాగా అన్ని వాదాలూ మాలో చేరిపోయేవే కాబట్టి మా కందరూ సమానమే. వ్యష్టితో చూచి ఒకవేళ ఇతర మతాచార్యులు మమ్ము తూలనాడినా ప్రచ్ఛన్న బౌద్ధుడని మమ్ము పరిహసించినా మేము వారినేమీ అనలేము. వారి అజ్ఞానానికి కేవలం మా మనసులోనేనవ్వుకొంటామని చెబుతూ దీనికొక చమత్కారమైన దృష్టాంతాన్ని సెలవిస్తారు భగవత్పాదులు. ఒక పిచ్చివాడు నేలమీద నిలుచోని ఏనుగుమీద కూచొని ఎదురుగా వచ్చే ఒక మావటిని చూచి "నేనూ ఏనుగునెక్కే ఉన్నాను - నీ ఏనుగును నా మీదికి తోలు - చూతామని” సవాలు చేస్తాడనుకోండి. అంత మాత్రాన వాడా ఏనుగును వీడి మీదికి తోలుతాడా. ఎప్పటికీ తోలడు. ఏమి కారణం. వీడు వట్టి వెట్టివాడని తెలుసు వాడికి. అలాగే కేవలం వెఱి వాళ్ళీ ద్వైతవాదులు. వాస్తవంగా ఏదీ లేకపోయినా ఏదో ఉందని వేళ్లాడుతున్నారు. వారు పట్టుకొని వేళ్లాడేది కూడా మా అద్వైత సత్యంలోనే అంతర్భవిస్తుంది కాబట్టి మాకు కోపం లేదు. వారిని మేము చక్కగా అర్ధం చేసుకోగలం అని ఉన్న విషయమున్నట్టు లోకానికి చాటుతారాయన.

   దీనిని బట్టి శంకర భగవత్పాదుల హృదయమేమిటో మనకిప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. పరమతాలనూ, మతాచార్యులనూ తప్పని చెప్పటంలో కూడా వారికి ద్వేషం లేదు. వారి భాషలో చెబితే అది కేవల మాభాసే. అదైనా ఎందుకు చేశారంటే లోకులంతా అదే సరియైన మార్గమని నమ్మి చెడిపోతారని. జగద్గురువులు కావటంవల్ల లోకోద్ధరణ గావించవలసిన బాధ్యత ఉందాయనకు. ఆ బాధ్యత నిర్వహించటంలో వీరు వారనే దాక్షిణ్యముండ గూడదిక. ఉంటే సత్యానికి కాకుండా వ్యక్తులకు విలువ ఇచ్చినట్టవుతుంది.

Page 213