ఈ న్యాయాన్ని బట్టి ఆలోచిస్తే ప్రస్తుత మీకపిల కణ భుగాదుల మతాలన్నీ ఇలా వికల్పాన్నే ప్రతిపాదిస్తున్నాయి. కాబట్టి అవి సత్యానికెంతో దూరమని ఊరక మెతుకు పట్టి చూస్తేనే చెప్పవచ్చు మనం. పోతే అద్వైతమనేది వాటన్నిటికీ భిన్నంగా అఖండమైన బ్రహ్మమొక్కటే ఉన్న పదార్థం. అది ఆత్మ స్వరూపమేనని సిద్ధాంతీ కరిస్తున్నది. కాబట్టి దానిలో వికల్పానికిక చోటులేదు. లేకుంటే అది ఏకరూపమే. ఇలాంటి ఏకరూపమైన సత్యాన్ని బోధిస్తుంది గనుక అది ఒక్కటే మనకు ప్రమాణమని వేరుగా చెప్పనక్కరలేదు. ఇదీ ఆచార్యుల వారు చేసిన పరిష్కారం. దీన్ని మనమెంత తార్కికంగా ఆలోచించినా కాదనలేము. కనుకనే అనన్య లభ్యమైన జగద్గురు బిరుదమాయన కొక్కరికే లభించింది. వ్యక్తులు కాదాయనకు కావలసింది. తత్త్వగవేషణ మాత్రమే. ఎంతటి మతాచార్యుడైనా తత్త్వాన్ని లోకులకు మభ్యపెట్టి చెబితే ఆయన సహించడు. లోకసంగ్రహం చేయవలసిన ఆచార్యుడికి లోకవంచన పనికి రాదు. అది కేవలమాత్మవంచనే అవుతుంది.
ఇలాంటి వంచన చేయవద్దనే ఆయా మతాచార్యులనందరినీ ఆయన మందలిస్తూ వచ్చారు. అంతేగాని వారిపైన ఆయనకు ద్వేషభావముండి గాదు. రాగద్వేషాలనేవి ఏ మాత్రమున్నా అది అసలు అద్వైత దర్శనానికే విరుద్ధం. అలాంటప్పుడద్వైతంలో పండిపోయిన జగద్గురువుల కలాటి భావాలనెలా అంటగట్టటం. ఈ విషయంలో ఆయన తనకు తానే ఇలా ఆత్మ విమర్శ చేసుకొన్నారు. ముముక్షువులైన వారికి మోక్షసాధనమైన మార్గమేదో దాన్ని నిరూపించి స్వపక్ష స్థాపనచేసుకోటమే ఉచితంగాని పరపక్షాన్ని అదే పనిగా ఖండించటం దేనికి. అది పర విద్వేషానికి దారి తీస్తుంది గదా. అని ప్రశ్నించుకొని దానికి తానే సమాధాన మిచ్చుకొన్నారు. "సాంఖ్యాది తంత్రాణి సమ్యగ్దర్శనాపదేశేన ప్రవృత్తాని ఉపలభ్య భవేత్కేషాంచి న్మందమతీనా మేతాన్యపి సమ్యగ్దర్శనాయోపాదేయానీ త్యపేక్షా. తథాయుక్తి గాఢత్వ సంభవేన సర్వజ్ఞ భాషిత త్వాచ్చ శ్రద్ధాచ తేషు ఇత్యతస్త దసారతోప పాదనాయ ప్రయత్యతే." సాంఖ్యాదులైన మతాలన్నీ సమ్యగ్దర్శనమనే పేరుతో లోకంలో చెలామణి అవుతున్నాయి. అది చూచి కొందరు మందమతులివి నిజంగానే మనల నుద్ధరిస్తాయని విశ్వసిస్తున్నారు. పైగా గొప్ప హేతువాదముండటం వల్లా, గొప్పవారు వాటిని ప్రచారం చేయటంవల్ల అవి అంటే ప్రత్యేకమైన అభిమానం కూడా ఉండవచ్చు.
Page 212