అవిరోధ పాదంలో బౌద్ధ మత సిద్ధాంతాలనూ ఖండిస్తూ ఇలా అంటారాయన. “అపిచ బాహ్యార్ధ విజ్ఞాన శూన్యవాద త్రయ - మితరేతర విరుద్ద ముపది శతాసుగతేన స్పష్టీకృతమాత్మనః అసంబద్ద ప్రలా పిత్వమ్, ప్రద్వేషోవా ప్రజాసు-విరుద్ధార్థ ప్రతిపత్యా విముహ్యేయు రిమాః ప్రజాఇతి - సర్వధాపి అనాదరణీయో యమ్ సుగత సమయః శ్రేయస్కామైః" బాహ్యార్ధవాదమని, విజ్ఞానవాదమని, శూన్యవాదమని ఒకదానికొకటి సంబంధం లేని మూడు వాదాలు లేవదీసి లోకాని కుపదేశించాడు. బుద్ధుడు ఇంత అసంబద్ధంగా మాటాడే వాడాయన సుగతు Aman with right under standing డెలా అయ్యాడో అర్ధం కావటంలేదు. ఇలాంటి విరుద్ధమైన భావాలు ప్రజల కాయనబోధించి పోయాడంటే ప్రజలమీద ఆయనకెంతటి ద్వేషముందో మన మూహించుకోవచ్చు. ప్రజలందరూ ఈ బోధలు విని దిక్కు తెలియక పాడయిపోవాలని బహుశా ఆయన ఆశయమయి ఉండవచ్చు. అంచేత శ్రేయస్కాముడైన వాడెవడూ కూడా ఈ బౌద్ధ సిద్ధాంతాన్ని కన్నెత్తి అయినా చూడగూడదు.
శంకరుని ఈ హెచ్చరిక బాగా గమనించామంటే మనకు రెండు సత్యాలు బయట పడతాయి. బుద్ధుడు తన ప్రవర్తనలో గొప్పవాడైతే కావచ్చుగాని ఆయన విజ్ఞానం మాత్రమేమంత గొప్పది గాదు. నీతివేరు. అనుభూతి వేరు. ఆయనకు కలిగిందని చెప్పే ఆధ్యాత్మికానుభూతి చాలా పరిమితమైనది. అది బుద్ధి విజ్ఞానాన్ని Intellect దాటి పైకిపోలేదు. ఇది ఒక సత్యం. పోతే రెండవదేమంటే అదే సర్వస్వమని చెప్పి తగుదునమ్మా అని లోకానికి బోధించి పోయే సాహసానికాయన గారు పూనుకోవటం.
దీనిని బట్టి చూస్తే శంకరుని దృష్టిలో ఒక మతమనీ మతాచార్యుడనీ గాదు. ప్రజాహితమే ప్రధానమని తేటపడుతున్నది. నిజానికొక జగద్గురువైన వాడికుండ వలసిన దృష్టి అదే. అది పరమార్ధాన్ని The Ultimate Reality అనుభవానికి తెచ్చుకొన్న వాడికే అబ్బుతుంది. దానినే సమ్యగ్దర్శన Right Knowledge మని పేర్కొంటారు శంకరులు. ఇలాంటి దర్శనం లేక నోరుంది గదా అని ఊరక వాగేవాళ్ళనెవరినైనా ఎంత పేరున్న వారినైనా క్షమించడాయన. మహావీరుడి లాంటివాణ్ణి ఆయన అన్నమాట లెలాంటివో ఆలకించండి. “కథమ్ ప్రమాణ భూత స్సంస్తీర్థ కరః ప్రమాణప్రమేయ ప్రమాతృ ప్రమితి ష్వనిర్థారితాసు-ఉపదేష్టుమ్ శక్నుయాత్–కథవ్వా తదభి ప్రాయాను సారిణః తదుపదిష్టేర్దే అనిర్దారిత రూపే ప్రవర్తేరన్.
Page 209