Mysticism అంటే ఏదో గాదు. జీవజగదీశ్వరులు మూడూ కలిసి ఏకమని చెప్పే అద్వైత భావమే. రహస్య విజ్ఞానమని దీని నెప్పుడో పేర్కొన్నారు. శంకర భగవత్పాదులు. ఉపనిషత్తనే మాటకు రహస్య విజ్ఞానమనే Secret or Eso-teric knowledge ఆయన చెప్పిన అర్థం. అపరోక్షానుభూతి అని యోగవిద్య అని కూడా అక్కడక్కడ దానినే వ్యవహరిస్తూ వచ్చారాయన. ప్రస్తుతమే మతం చూచినా సరే. అది క్రైస్తవమేగాదు ఇసలామే గాదు. బౌద్ధమే గాదు. జైనమే గాదు. ప్రతి ఒక్కటీ ఇప్పుడీ రహస్య విద్యనే పరాయణంగా Goal or End భావిస్తున్నది. క్రైస్తవం Christian Mysticism New thought ఒక మార్గాన్ని భోధిస్తున్నది మనకు ఇస్లాములో తసవ్వుఫ్ అనే క్రొత్తశాఖ అవతరించిఅది "వహ దతులప్పుజూద్" అంతా కలిసి ఒకే ఒక సత్త అని తీర్మానించింది. మరి బౌద్ధం Zen Budhism గా రూపుమారిపోయింది. పోతే ఇక హైందవాన్ని గూర్చి చెప్పనే అక్కరలేదు. సాంఖ్య యోగభేద - భేదా భేదవాదాల నన్నింటినీ పూర్వపక్షం చేసి అది ఎప్పుడో అద్వైత జ్ఞానానికి పట్టాభిషేకం చేసి కూచున్నది. "ఏకమే వాద్వితీయమ్ బ్రహ్మ నేహ నానాస్తి కించన - సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ అయ మాత్మా బ్రహ్మ, అహమ్ బ్రహ్మాస్మి” అని ఉపనిషత్తులు ఘోషించే ప్రతిమాటలో అద్వైత భావమే ప్రతిధ్వనిస్తుంది.
ఇలాంటి విశ్వజనీన మయిన విజ్ఞానాన్ని మనకు అన్ని హంగులతో ప్రసాదించి పోయారు శంకర భగవత్పాదులు. అందులకీ మానవజాతి అంతా ఆయన కెంతైనా ఋణపడి ఉంది. కాని ఆ మహనీయుణ్ణి అనుకొనే నాథుడు లేడు. లోకంలో ఆయనకు రావలసినంత పేరు రాలేదు. అదే ఒక గౌతముడో ఒక క్రీస్తో ఒక మహావీరుడో మరొకరో అయితే ఎక్కడ లేని పేరూ, ప్రతిష్ఠా దేశంలోనే కాదు. విదేశాలలో కూడా మారుమోగుతూ ఉంది. అంతెందుకు. మనమింతగా నెత్తిన బెట్టుకొని ఊరేగే గౌతముని లాంటి మహాపురుషులు కూడా ఆధ్యాత్మిక రంగంలో ఈ మానవ సమాజానికి చేసిన మేలేదీ లేదు. మీదు మిక్కిలి కావలసినంత కీడు చేసి పోయారు. ఈ మాట నేనూ మీరు అనటంగాదు. శంకర భగవత్పాదుల నోట వచ్చిందంటే ఇక ఆలోచించండి.
Page 208