కాబట్టి మరణమనేది సామాన్యంగానే Equal సంభవించినట్టు కనిపించినా ముక్తుడికీ ఇతరులకూ తేడా ఉంది. ముక్తుడికి ప్రాణోత్రమణం లేదు. తన్నిమిత్తమైన ప్రయాణమూ లేదు. దానికి కారణమొక్కటే. మిగతా లోకులంతా అజ్ఞానంతో అనృతాభి సంధులై పోతే వీడు బ్రహ్మజ్ఞాన బలంతో సత్యాభి సంధి అయి ఉంటాడు. కాబట్టి ఎక్కడికీ కదలిపోనక్కరలేదు. అభిసంధి అంటే సంకల్పం లేదా ఉద్దేశ Intention మని అర్థం. అది సత్యం మీదనే ఉంటే వాడు సత్యాభి సంధుడు. అలాకాక అనృతం మీద ఉంటే అనృతాభిసంధుడు. దీనినొక చక్కని లోకవృత్తంతో ముడిపెట్టి మన మనసుకు పట్టే లాగా వక్కాణించి చెబుతున్నది ఛాందోగ్యోపనిషత్తు. ఒకడు దొంగతనం చేశాడని అనుమానించి వాణ్ణి రాజభటులు పట్టుకుపోతున్నారట. వాడు నేనే పాపమెరుగను చాలామంచి వాడనని నలుగురినీ చూచి మొరబెడుతున్నాడట. అప్పుడక్కడ ఉన్న పెద్ద మనుషులంతా చేరి వాడికొక పరీక్ష పెడతారట. అదేమిటంటే గాడి పోయిలో బాగా ఎఱ్ఱగాకాల్చి తీసిన గడ్డ పార వాడిచేతి కివ్వమంటారు. వాడది రెండు చేతులతో గట్టిగా పట్టుకొని దూస్తూ పోవాలి. అలా దూసిన తరువాత వాడి చేతులు కాలటంగాని బొబ్బలెక్కటంగాని లేకపోతే వాడు సత్యాభిసంధుడు. లోపల ఎలాగో పైకి అలాగే ఉన్నాడని అర్థం. మరి దూసిన వెంటనే కాలి బొబ్బలెక్కాయో వాడనృతాభిసంధుడు. లోపల దొంగనని తెలిసి కూడా పైకి కాదని బుకాయిస్తున్నాడు. ఇందులో సత్యాభిసంధుడేనని ఋజువయితే వాణ్ణి వదిలేస్తారు. అలా కాని వాణ్ని మాత్రం చావగొట్టి చెవులు మూస్తారు. ఇలాంటి వ్యవహారమిప్పటికీ మనం పామరులనుకొనే అడవి కొండ జాతులలో కనిపిస్తూనే ఉంది. మనం చూస్తున్నాము. ఈ సంగతి ఉపనిషత్తుకూడా ఉదహరించిందంటే అది ఇక ఎప్పటినుంచి చెలామణిలో ఉందో ఆలోచించండి.
ప్రస్తుత మీ దృష్టాంతాన్ని మనం దార్థాంతికంతో సరిపోల్చుకొని చూడవలలసి ఉంది. మనకిక్కడ సత్యాభిసంధుడు జీవన్ముక్తుడు. వాడు యావజ్జీవమూ పరమ సత్యమైన బ్రహ్మాత్మ భావాల్నే పట్టుకొని కూచున్నాడు. మనోవాక్మరీరాలు మూడూ తదాకారంగా భావిస్తూ ఉన్నాడతడు. ఆ అనుసంధాన బలంతో రేపు అవసానం సమీపించినపుడు కరణవర్గం మనసులో మనసు ప్రాణంలో - ప్రాణం తేజస్సులో ఆ తేజస్సు సదాఖ్యమైన మూల తత్త్వంలో కలుస్తుంటే నేనీ సదాఖ్యతత్త్వమేనని భావిస్తూ అదే అయిపోతాడు.
Page 196