"న తస్య ప్రాణా ఉతామంతి - ఇహైవ సమవనీయంతే” మిగతా వాళ్ళ ప్రాణాల మాదిరి ఉత్రమణ చెందకుండా అవి ఇక్కడే సమసిపోతాయని చాటుతుందుపనిషత్తు. ఎందుకంటే ఉత్రమణ చెందటమనే ప్రసక్తి కర్మ ఫలమనుభవించవలసి ఉంటేనే. అలాంటివారు స్థూల శరీరం పడిపోగానే సూక్ష్మ శరీరంలో కూచొని లోకాంతరాలకు ప్రయాణం కడతారు. వారిలో కేవల కర్మిష్ఠులైతే పితృలోకాలకు- ఉపాసకులైతే సత్యలోకానికి పోయి చేరుతారు. కాగా ఒక్క విదేహముక్తులు మాత్రమే ఎక్కడికీ వెళ్ళరు. కేవలం నిర్గుణ తత్త్వజ్ఞులువారు. తత్త్వజ్ఞాన ప్రభావంచేత వారికి కర్మా-కర్మతోపాటు స్థూల సూక్ష్మకారణాలనే త్రివిధ శరీరాలు కూడా ఎగిరిపోయాయి. ఇక ఎక్కడికీ పోవటానికి గానీ సాధన Conveyance మేముంది వారికి. సాధ్య సాధనాత్మక Ends & Means మైన సంసారమంతా వారి దృష్టకి బ్రహ్మస్వరూపమే. అది ఆత్మాభిన్నమే.
అంచేత దేహపాతం కాగానే ప్రాణం దగ్గరి నుంచీ, మనస్సు దగ్గరినుంచీ అన్ని ఉపాధులూ వారికాత్మ చైతన్యంలోనే పనగలిసిపోతాయి. అది ఎలాగ అని అడిగితే “యథా ఊర్మయ స్సముద్రే” అన్నారు భగవత్పాదులు. సముద్రంలో తరంగాల మాదిరట. సముద్రంలో నుంచే ఉదయిస్తాయి తరంగాలు. సముద్ర జలంకన్నా విలక్షణంగా కనిపిస్తాయి. మరలా ఒడ్డుకు వచ్చి అక్కడ విరిగిపోతే విరిసి ఆ సముద్రంలోనే కలిసిపోతాయి. అప్పుడిక అంతా సముద్రమే. తరంగమనేది ఎక్కడ లయమయిందో ఎవరికీ అంతుపట్టదు. అలాంటిదే విదేహముక్తుడి దశ కూడా నన్నారు. మహాభారతం మోక్ష ధర్మ పర్వంలో ఈ దశనిలా వర్ణించారు వ్యాసభగవానులు. “శకునీనామివా కాశే- మత్స్యా నాంతు యథాజలే - పదమ్ యథా నదృశ్యేత - తథా జ్ఞానవతామ్ గతిః" ఆకాశంలో పక్షులు పోయిన జాడ నీళ్ళల్లో చేపలు పోయిన జాడ ఎలా మనకు గుర్తు చిక్కదో - అలాగే ముక్తులు పోయే జాడ కూడా మనకంతు చిక్కదట. ముక్తులలో చక్రవర్తి అయన శకుమహర్షి జీవితంలో ఇది చక్కగా వ్యక్తమవుతుంది మనకు. "శకస్తు మారుతా చ్ఛీఫ్రమ్ - గతిమ్ కృత్వాం తరిక్షగః దర్శయిత్వా ప్రభావం స్వం సర్వభూత గతో భవత్” గాలికన్నా శీఘ్రమైన గమనంతో శుకుడంతరిక్షాని కెగిరిపోయి అనంతర మీ సకల భూతాల అంతరంగాలలోనూ ప్రవేశించి అదృశ్యమయి పోయాడట.
Page 195