నా చైతన్య మహాదీప్తిలో నాకు నేనే కనిపిస్తున్నా ననే భావంతో ఉంటాడట. “శయన విధౌ మగ్న ఆనంద సింధౌ” పోతే ఇక రాత్రి పడుకొని నిద్రపోయేటప్పుడైతే నేనిపుడు నా చిదానంద సాగరంలోనే మునుకలు వేస్తున్నానని కులుకుతాడట. ఇలా నిరంతరాంతర్నిష్ఠుడై బ్రహ్మజ్ఞాని తన జీవితకాలం గడుపుతాడంటా రాయన.
చూడండి. యాదృచ్ఛికంగా చెప్పినట్టు కనిపించినా ఇందులో చెప్పిన నాలుగే
అసలు దైనందిన జీవితంలో ఉన్న దశలు కూడా. అంతకు మించి మరేదశా మనకు
జీవితంలో తారసిల్లదు. ఎప్పుడు చేసినా ఒక చలనమైనా చేస్తుంటాము. చలించకుండా
నైనా ఊరుకొంటాము. లేదా శబ్ద స్పర్శాదులైన విషయాలతోనైనా వ్యవహరిస్తుంటాము.
ఇక ఏదీ లేదంటే పడుకొని నిద్ర అయినా పోతాము. ఇంతే మనం నిత్యమూ చేసే
పనులు. ఈ నాలుగు పనులలోనూ మనం నాలుగు దృష్టులతో ఉంటాము. అందులో
ఆత్మదృష్టి కసలు జాగాయే లేదు. పోతే ముక్తుడైన వాడీ నాలుగింటినీ ఆత్మదృష్టితోనే
భావిస్తాడు కాబట్టి వాడికంతా ఆత్మే. అనాత్మగా కనిపించదేదీ.
మరొక శ్లోకంలో కూడా చూడండి ఈ ఆత్మానుభవాన్ని ఎంత మనోహరంగా వర్ణించారో. “యావాన్ పిండో గుడస్య-స్ఫురతి మధురిమా తత్ర సర్వోపితావాన్ యావాన్ కర్పూర పిండః పరిమళతి సదా మోద ఏవాత్ర తావాన్- విశ్వమ్ యావద్విభాతి ద్రుమనగ నగరారామ చైత్యాభిరామమ్ - తావచ్చైతన్య మేకమ్ ప్రవి కసతి యంతే తదాత్మావ శేషమ్" గుడ పిండమంటే ఉండగా ఉండే బెల్లం. ఉండలో బెల్లమనే పదార్ధమెంత దూరముందో అంత దూరమూ దాని అణువణువూ వ్యాపించి ఉంది మాధుర్యం. బెల్లమంతా మాధుర్యమే. మరేదీ గాదు. అలాగే ఒక గడ్డ కట్టిన కర్పూరముందంటే అది కొనా మొదలూ పరిమళమే. మరేదీ గాదు. ఈ బెల్లమూ కర్పూరం మాదిరే ఇప్పుడీ వననదీ సముద్ర పర్వత పట్టణ పృథివ్యంత రిక్షాది ప్రపంచమంతా. బెల్లమంతా మాధుర్యమూ- కర్పూరమంతా పరిమళమూ-అయినట్టే ఈ విశ్వమంతా ఎంత ఉందో అంతా ఆ చైతన్యమే. చైతన్యమే సృష్టిలో ప్రతి అణువూ లోపలా వెలపలా సందు లేకుండా క్రిక్కిరిసి ఎక్కడ చూచినా పిక్కటిల్లి Replete ఉంది. చైతన్యం వినా మరేదీ కానరాదు. కారణం దానితోనే చివర కీకార్య జగత్తంతా పర్యవసిత మవుతున్నది.
Page 187