మనమూ మన శరీరాలలోనే ఉన్నప్పటికీ శరీరమే నేననే తాదాత్మ్యంతో ఉంటాము. కాబట్టి ఒక గేహంలో మాదిరి ఒక దేహంలో ఉన్నామనే ప్రజ్ఞలేదు మనకు. అదే ముక్తుడికైతే ఉంటుంది. ఎందుచేత. దేహాది సంఘాతంకంటే నేను వ్యతిరిక్తుణ్ని అనే భావముంది వాడికి. అంచేత దేహం చేసే పనులుగాని వాటి ఫలంగాని వాడినంటదు. అది వాడి దృష్టిలో చచ్చినపాములాంటిది. అక్కడ ఉన్నా కనిపిస్తున్నా వాడికి లేనిదే.
విలక్షణమైన ఈ అనుభవాన్ని ఒక విచిత్రమైన దృష్టాంతంతో మనకు స్పష్టం చేస్తున్నది బృహదారణ్యకమనే ఉపనిషత్తు “తద్యథా అహినిర్లయనీ వల్మీకే మృతా ప్రత్యస్తాశయీత - ఏవమేవేదగం శరీరగం శేతే-అథాయ మశరీరో 2 మృతః” నిర్ల్వయని అంటే పాము విడిచిన కుబుస. అది అంతకు ముందు దాని శరీరంలో భాగమే. శరీరమే. దానినే అది విసర్జించిన తరువాత అక్కడ పుట్టలోనే ఒక ప్రక్కన పడి ఉన్నా గాలికి కదులుతున్నా చేస్తున్నా నాది అనే భావంతో చూడదది. తన దేహంతో కలిసి ఉన్నప్పుడది సజీవమైనా ఇప్పుడది నిర్జీవం. అలాగే ముక్తుడి శరీరం కూడా ఆత్మజ్ఞాన బలంతో ఒక కుబుసం లాగానే ఊడిపోయింది. అది ప్రారబ్దవశాత్తూ అక్కడా అక్కడా లోకంలో తిరుగుతున్నా దానిని తనదిగా చూడడు జీవన్ముక్తుడు. అది వాడి దృష్టికి మృత కళేబరం. మరి తానో అమృత స్వరూపుడు- అని చాటుతున్న దుపనిషత్తు. అలా శారీర లౌకికాది కర్మకలాపమంతా శరీరమే చేస్తుంది గాని నేను కించిత్తు కూడా చేయటం లేదని నిత్యమూ అలాంటి ప్రత్యయంతో Attitude ఉండాలంటే దానికెంత ధైర్యముండాలో ఆలోచించండి. బ్రహ్మాత్వభావం బాగా ఆరూఢమైన ముక్తపురుషుడే అలా ముక్తకంఠంతో చాటగలడు.
అయితే అదే సత్యమైన అనుభవమైననాడు సర్వులకూ అది కలగాలి గదా ప్రత్యేకించి ఒకానొక మానవుడికే కలగటమేమిటి. అలా కలిగితే కలిగిందో లేదో మనకేమిటి దాఖలా అని మరలా సందేహించవచ్చు. అలాంటి సందేహాలే విషయంలో నైనాఎవరికైనా కలిగేవేనంటారు భగవత్పాదులు. దానికి కారణం మనకా విద్యలో తగిన శిక్షణా ప్రవేశమూ లేకనే గాని మరేదీ గాదు.
Page 185