వాటిని కూడా తన స్వరూపంలోనే లయం చేసుకొని తన స్వరూపంగానే మార్చుకొని చూస్తాడు. అప్పుడనుభవమయినా అది అనుభవంలో చేరిక గాదు. మామూలు లోకుల అనుభవం వేరు. ముక్తుడి అనుభవం వేరు. లోకులిది జ్ఞానమది జ్ఞేయమనే ద్వైత దృష్టితో అనుభవిస్తారు. వాడికోజ్ఞేయ మనేది లేదసలు. అంతా జ్ఞానమే. అది తన స్వరూపమే. కాబట్టి స్వరూపాని కప్పథ గ్భూతంగా Undifferentiated చూస్తూ అనుభవిస్తాడు ప్రతిదీ. అంచేత ఇది ఒక విధంగా చెబితే అనుభవం కాని అనుభవం. ఇలాంటి అఖండానుభవంలో ఇక సుఖమూ- దుఃఖమూ అనే ప్రశ్నేముంది. "ప్రియా ప్రియే నస్పృశతః-సర్వమాత్మైవాభూత్” అంతా తన స్వరూపమే. అలాంటప్పుడు శరీరమొకటి ఉందనే స్పృహ కూడా వాడికి లేదు. చరాచర ప్రపంచమంతా ఆత్మచైతన్యమే. అలాంటప్పుడిక దానిలో ఏకదేశమైన Part శరీరం మాట చెప్పేదేముంది. కరచరణా ద్యవయవాలతో కనపడుతున్నా అదీ బ్రహ్మమే వాడి పాలిటికి. అయితే ఈ కరచరణాదులుగా కనపడే దెవరికీ. అలా దర్శిస్తున్న మిగతా లోకుల దృష్టికే నంటారు భగవత్పాదులు.
మరి ఇలాంటి దశ జీవితంలో సంభవమా అని అడిగితే సంభవమేనని డంకా బజాయించి చాటుతారాయన. ఇక్కడ శాస్త్రం కాదిక వాడి స్వానుభవమే మనకు ప్రమాణం. వెధవది-సవిషయమైన సాహిత్యంలోనే ఫలానాచోట ఫలానా రసానుభవం కలుగుతుందా లేదా అంటే సహృదయ హృదయమే ప్రమాణం పొమ్మని నోరు మూయిస్తారు. అలాంటప్పుడిక నిర్వషయమైన ఆధ్యాత్మ రంగంలో అనుభవమే ప్రమాణమంటే తప్పేముంది. అందుకే “స్వహృదయ ప్రత్యయ మిద" మని పదేపదే హెచ్చరిక చేస్తుంటారు భగవత్పాదులు. అసలు శాస్త్రమనే దెప్పుడు గానీ మానవుడి అనుభవంతో మిళితమైనప్పుడే గదా దానికి ప్రామాణ్యం శాస్త్రం జ్ఞానమైతే Phi-losophy దాని అనుభవం విజ్ఞాన Mysticism మన్నది భగవద్గీత. మరొకచోట అదే దీనిని జ్ఞానమనీ-దానిని యోగమనీ- వ్యవహరించింది. రెండింటికి భాష్యం వ్రాస్తూ భగవత్పాదులొకటి కేవల శాస్త్ర జన్యమైతే మరొకటి స్వానుభవ కరణమని స్పష్టంగా వింగడించారు మనకు.
Page 183