#


Back

   ఇవన్నీ పరంపరా సాధనాలే దానికి. శమాదులు కొంత దూరమైతే- శ్రవణాదులు మరికొంత సన్నిహితం. అంత మాత్రమే.

   ఇందులో శమాదికమైన కర్మయోగం మతం Religion క్రిందికి వస్తే శ్రవణాదికమైన జ్ఞానయోగం విద్య Philosophy క్రిందికి వస్తుంది. ఇవి రెండూ మనం యథాశక్తిగా ప్రయత్నం చేస్తే అంచెల వారగా మన ప్రారబ్ధకర్మకు జవాబు చెబుతాయి. అప్పుడొక ప్రక్క కర్మ ఫలమనుభవానికి వస్తున్నా మరొక ప్రక్క బ్రహ్మవిద్యను సాధించవచ్చు. దానికెంతైనా అవకాశముంది ప్రకృతిలో. అది గుర్తించి మానవుడు తన ఉద్యమం సాగించాలి గాని అంతా దైవాధీనమని చేతులు ముడుచుకొని కూచోరాదు. అది సోమరితనం క్రిందికి వస్తుంది. కర్మ సిద్ధాంతం మానవుణ్ణి సోమరిని చేయటానికి గాదు. అది ఉంటే ఉంది. జరిగిన దానికి మనమేమి చేయలేము - ఇక జరగబోయేది నీచేతిలో ఉంది - చేతనైతే దానికి విరుగుడుగా సన్మార్గంలో కృషి చేసి తరించమని ధైర్యం చెప్పటానికే. “ఉత్తిష్ఠత -జాగ్రత-ప్రాప్యవరా న్ని బోధత” “ఇహచే దవేదీ దథ సత్యమస్తి - నచే దిహావేదీ న్మహతీ వినష్టి” ఇలాంటి హెచ్చరికలన్నీ ఇందుకోసమే.

   అయితే శాస్త్రమిలాంటి ప్రబోధాలెన్ని చేసినా ఆచార్య పురుషులెంత ఘోషించినా - ఇంకా సందేహమే మానవులకు. ఇదంతా నిజమేనా నిరంతంరమూ ఈ సంసార సాగరంలో మునిగి తేలుతున్న మనబోటి అల్పప్రాణులమెంతని ప్రయత్నించ గలం. ప్రయత్నిస్తే మాత్రమంతటి మహాఫలం మనకబ్బుతుందా. చూడబోతే ఇది మనకే మాత్రమూ సాధ్యపడేది గాదని వై మనస్యం చెందుతంటారు. ఇది ఏ మాత్రమూ సహించదు శాస్త్రం. శాస్త్ర ప్రవర్తకుడైన భగవానుడేమన్నాడో వినండి. “సంశయాత్మా వినశ్యతి” సంశయం పెట్టుకొంటే పాడయిపోతాడు మానవుడు. “ప్రత్యక్షావ గమమ్ ధర్మ్యమ్ సుసుఖమ్ కర్తు మవ్యయమ్” ప్రత్యక్షంగా మన ఎదుట ఉన్న వస్తువును చూచినట్టు చూడవచ్చు తత్త్వాన్ని దానిని చూచి అనుభవానికి తెచ్చుకొనే సాధన కూడా చాలా సుళువైనదని హామీ ఇస్తాడు.

   అయినా మనకెందుకీ సందేహ పిశాచం వదలదని అడిగితే భగవత్పాదులిలా సమాధానమిస్తారు. "సత్యమేవమ్ గురు సంప్రదాయ రహితానామ్ - అశ్రుత

Page 163