#


Back

   ఇవి కూడా మామూలు కర్మిష్ఠులు చేసే తీరు వేరు. మోక్ష సాధకుడు చేసేతీరువేరు. కర్మిష్ఠులిది మాకు శాస్త్ర విహితమైన కర్మ - మేము మాత్రమే చేయవలసిందిది చేస్తే అది ప్రత్యవాయ దోషాన్ని పరిహరించి మాకు శ్రేయోదాయకమవుతుందని అహంకార మమకారాలు వదలకుండా చేస్తారు. దానివల్ల కర్మ కాలుష్యమింకాఎక్కువ అవుతుందేగాని సలీసు చిక్కదు. మరి జ్ఞాన సాధకులూ చేస్తారు కర్మ. కానీ వారలా చేసేటప్పుడు నేను నాది అనే భావాలకు తావీయకుండా చేస్తారు. కాబట్టి ఎలాటి కాలుష్యం గానీ ఏర్పడదు వారికి. మీదు మిక్కిలి అవి వారికి సంస్కారహేతువులే అవుతాయి. సంస్కారమంటే ఇక్కడ పరిశుద్ధి అని అర్ధం.

   నిత్యాది కర్మలు సంస్కార హేతువులెలా అవుతాయని అడగనక్కరలేదు. “సహ వా ఆత్మయాజీ యోవేద - ఇదమ్మే అనేనాంగమ్ సంస్క్రియతే - ఇదమ్ మే అనే నాంగమ్ ఉపధీయతే” అని శ్రుతి వాక్యం ఇదుగో ఈ కర్మ చేస్తున్నాను. దీనివల్ల నా శరీరమూ - ఇంద్రియాలూ పరిశుద్దమవుతాయి. అనే సంకల్పంతోనే చేస్తాడట ఆత్మయాజ్ఞి. ఆత్మను యజించేవా డాత్మయాజి. యజనమంటే కర్మాచరణమే. ఏ కర్మ నాచరిస్తున్నా అది ఆత్మ కోసమేనని ఆత్మార్పణ దృష్టితో ఆచరిస్తాడు. కాబట్టి జ్ఞాన సాధకుడెప్పుడూ ఆత్మయాజే గాని సోమయాజికాడు. ఇలా ఆత్మశుద్ధి కోసమే చేయాలి కర్మలని శ్రుతి చెప్పటమేగాదు. తదనుయాయులైన స్మృతులు కూడా అలాగే చెబుతున్నాయంటారు భాష్యకారులు. "సర్వేషుచ స్మృతి శాస్త్రేషు కర్మాణి సంస్కారార్థాన్యేవ ఆచక్షతే-అష్టా చత్వారింశత్సంస్కారా” ఇత్యాదిషు. చివరకు భగవద్గీత కూడా ఈ మాటే చాటుతున్నది. “యజ్ఞోదానమ్ తపశ్చైవ పావనాని మనీషిణామ్.” యజ్ఞమూ-దానమూ-తపస్సూ ఇవన్నీ పావనమైన కర్మలు. పావనమంటే శుద్ధిని ప్రసాదించే వనేగదా అర్ధం. వీటి మూలంగా సత్త్వం విశుద్ధమైతే “జ్ఞానోత్పత్తి ర ప్రతి బంధేన భవిష్యతి” జ్ఞానమనేది అప్రతిహతంగా ఉదయిస్తుందని హామీ ఇస్తారాయన.

   మొత్తం మీద కర్మలు సత్వశుద్ధ కోసమే నని చేయాలి గాని స్వర్గాది ఫలాల కోసమని చేయరాదు. అలాగైతే ఉపనిషత్తులు వాటిని పని గట్టుకొని చెప్పనక్కరలేదు. ఉపనిషత్తులు కర్మోపాసనలు రెండూ ఆత్మజ్ఞానాని కుపస్కారక Contributory మనే దృష్టితోనే వర్ణిస్తాయి. అందులో నిత్యనైమిత్తిక కర్మలు చిత్తశుద్ధిని ప్రసాదిస్తే

Page 159