#


Back

   అందులో నుంచి వైదొలగక పోయినా ఫాయిదా లేదు. అలాగే "నాసమాహితః" అసమా హితుడంటే మనస్సుకు ఏకాగ్రత లేక ఎప్పుడూ చిత్త విక్షేపానికి Distraction లోనైన వాడు. వాడికీ లభించే సొత్తుగా దది. అలాగే "నా శాంత మానసః" మనసులో అంతరాంతరాలలో ఎన్నో తీరని కోరికలుంటాయి మానవులకు.

   ఏతావతా శ్రవణాది విచార మార్గంలో అడుగుపెట్టే యోగ్యత మనకేర్పడాలంటే దానికి పూర్వరంగం లాంటి కాయేంద్రియ శుద్ది మన కనివార్యంగా ఉండి తీరాలని తేట పడుతున్నది. ఇందుకోసమే ఉపనిషత్తులలో ఆయా కర్మలను గూర్చి ఉపాసనలను గూర్చీ-చర్చించవలసి వచ్చింది. లేకపోతే జ్ఞానైక పరాయణమైన ఉపనిషద్వాఙ్మయంలో ప్రవేశించే అధికారం వాటి కెక్కడిది. అవి రెండూ అనుష్ఠాన కోటిని దాటిపోయేవి కావు కదా. అనుష్ఠానమనే సరికొక కర్తా - కారకమూ- క్రియా - ఫలమూ - ఈ కలాపమంతా వచ్చి కూచుంటుంది. అది ఒక భేద దృష్టిని పెంపొందించేదే గాని అభేదరూపమైన ఆత్మానుభవానికెలా ఉపకరిస్తుంది. ఒకటి పూర్వ సముద్రమైతే మరొకటి పశ్చిమ సముద్రమన్నారు స్వామివారు. పూర్వ సముద్రానికి పోవలసినవాడు పశ్చిమానికి పయనిస్తే ఏమి సుఖం. దానివల్ల రెండు నష్టాలు మనకు. చేరవలసిన గమ్యాన్ని చేరకపోవటం. దానికి ప్రతికూలమైన గమ్యాన్ని చేరటం. అలాగే ఇక్కడ కూడా కర్మోపాసనలను పట్టుకొని పోతే జీవిత గమ్యమైన ఆత్మకు దూరమై అగమ్యమైన అనాత్మ ప్రపంచంతోనే తల పట్లు పట్టవలసి వస్తుంది.

   అంచేత కర్మోపాసనలనేవి ఉపనిషత్తులు మనకు సిఫారసు చేశాయంటే అవి మన ఆత్మజ్ఞానాని కంగభూతంగా ఉపకరించాలనే అభిసంధితోనే Intention చేసి ఉండాలంటా రాచార్య సార్వభౌములు. అది ఇంతకు ముందే మేము వివరించి ఉన్నాము. మోక్షగామి అయిన మానవుడు నిషిద్ధాలతోపాటు కామ్యకర్మలను కూడా వదిలేయాలి. ఇహాముత్ర భోగాల మీద మనసున్నంత వరకూముందు చెప్పినట్లు శాంత మానసులం కాము మనం. కాకపోతే అది ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకమే గదా. కాబట్టి కామ్యరాశిని కూడా విసర్జించవలసిందే. ఇలా కామ్య నిషిద్ధాలు రెండూ కాదనుకుంటే ఇక ఆచరణ యోగ్యమైనవి నిత్య నైమిత్తికాలురెండే అవుతాయి.

Page 158