#


Back

   ఈ వాసనలనండి. లేదా సంస్కారాలనండి. ఆచార్యులవారు చెప్పినట్టు ఇవి అనాది నుంచీ మనసులో బాగా పేరుకొని Instinct పోయి ఉన్నాయి. కాబట్టి వీటికి సంచిత Accrued మని పేరు పెట్టారు. సంచితమంటే బాగా పోగయిన పదార్ధమని భావం. ఇది అపరిమేయంగా Immeasurable ఉంది మనకు. ఈ సంచితం నుంచి కొంత కర్మ జారీ అయితే దానికి ప్రారబ్ధమని పేరు. ప్రారంభమైనదేదో అది ప్రారబ్దం. దీనివల్లనే ప్రస్తుతం మనకీ జన్మ ఏర్పడింది. ఈ వచ్చిన జన్మ మనకెంత కాలముండాలో ఇందులో మన మేయే ఘనకార్యాలు చేయాలో - ఎలాంటి కష్టసుఖాలనుభవించాలో మన ఊహలెలాటివో - మాట లెలాటివో ప్రతి ఒక్క కదలికా ఈ ప్రారబ్ధమే నిర్ణయిస్తుంది. మరి కర్మ ఫలాన్ని అనుభవించటానికేకాదీ జన్మ. ప్రారబ్ధఫలాన్ని ఒక ప్రక్క అనుభవిస్తూనే మరో ప్రక్క మరలా కర్మ ఆచరిస్తూనే ఉంటాము. అది మరలా మన సంచిత కర్మకు చేరుతూ పోతుంది. దీని కాగామి అని పేరు. ఆగామి సంచితానికీ సంచితం ప్రారబ్ధానికీ - ప్రారబ్ధం మరలా సంచితానికీ దారి తీస్తూ పోతుంది. దీనితో మానవుడికీ కర్మ అనేది ఒక ఇసుక పాతరలాగా ఎప్పటికీ తరగకుండా అలాగే నిలిచి ఉంటుంది.

   ఇలాంటి విషవలయంలో చిక్కుకొని కాలం గడుపుతూ మన మీ జన్మలో ఒక్కసారిగా బ్రహ్మజ్ఞానమనేది ఆర్జించటానికి నడుము కట్టాము. ఈ జన్మలో ఎక్కడ పట్టినా ప్రారబ్ధమే రాజ్యం చేస్తున్నదాయె. పైగా అది మన మీ జ్ఞానానికి ప్రయత్నం చేయకముందే రంగంలోకి వచ్చి ఉంది. పోతే ఈ ప్రయత్నమది వచ్చి ఉన్న తరువాత ఎప్పుడో ఆరంభమవుతున్నది. కర్మ వృత్తి మొదటిది. జ్ఞానవృత్తి తరువాతిది. కాబట్టి మొదటి నుంచీ పాతుకొని ఉన్న కర్మవృత్తికే Operation of acton బలం జాస్తి. దాని తరువాత ఎప్పుడో రంగంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు క్రొత్తగా కలిగే ఈ జ్ఞానవృత్తి Operation of knowledge కంత బలం చాలదు. బలం చాలకపోయే సరికది దీన్ని తల ఎత్తకుండా ఎక్కడికక్కడ అణగద్రొక్కటానికే ప్రయత్నిస్తుంది. ఇందులో ఆ ప్రయత్న ఫలమే మనకెంత సామగ్రి ఉన్నా బ్రహ్మజ్ఞానమనేది వెంటనే కలగకపోవటం.

Page 145