అంతా కలిసి ఒక సమష్టిగా అనుభవానికి వస్తుంది. ఇలాంటి ఒకానొక సమష్టి రూపమైన దృష్టి ఆచార్యుల వారిది. ఇంత గొప్ప దృష్టి అలవడటంవల్లనే ఆయన శ్రుతి స్మృతి పురాణేతి హానరూపమైన వాఙ్మయానికంతటికీ ఏకవాక్యతా రూపమైన చక్కని సమన్వయాన్ని సాధించగలిగారు. ఈ సమన్వయం మూలాన్నే అద్వైత విజ్ఞానమనేది మొదటి నుంచీ మన ఉపనిషత్తులలోనే గుప్తమయి ఉన్నప్పటికీ స్వామివారి చేతిలోబడి అది మరలా ఒక సానబెట్టిన రత్నంలాగా ప్రకాశించగలిగింది. సరిక్రొత్తగా మనకు భాసించగలిగింది. భగవత్పాదులే లేకపోతే ఇంత అనర్ఘమైన రత్నాన్ని బయటికి తీసేవారూ లేరు. దాని కాంతి రేఖలు మన మనః ఫలకాలమీద ప్రసరించేవీ కావు.
మరి ఇంత విలువైన నిక్షేపాన్ని మనకాయన ప్రసాదించి పోయారంటే మనమా మహనీయుడి కెంతగా ఋణపడి ఉన్నామో చెప్పనక్కరలేదు. మనమంటే ఒక్క భారతీయులమే గాదు. భూమండలంలో ఉండే సమస్త మానవులూ కూడా ఋణగ్రస్తులే. ఈ ఋణ భారం నుంచి విముక్తులం కావాలంటే మనమంతా కలిసి చేయవలసిన కార్యమేమిటి. ఆయన ప్రసాదించి పోయిన అద్వైతామృత రసాన్ని తనివిదీర ఆస్వాదించి అమర్త్య భావాన్ని అందుకోటమే తప్ప మరేదీ గాదు.
అయితే ఈ పాటికి మనమెంతో విజ్ఞానమార్జించాము గదా. అద్వైత విజ్ఞానమొక్కటి లేకపోతే మనకు మొక్క పోయిందేమిటని అడగవచ్చు. మనమెంత విజ్ఞానమార్జించినా ఎన్ని అంతరిక్షయానాలు సాగించినా -అదంతా కేవలం సాపేక్షమే Relative ననే మాట మరచిపోరాదు. సాపేక్షమైన జ్ఞానమది ఎంత గొప్పదైనా నరే, మానవుడి నమస్యను వూర్తిగా పరిష్కరించలేదు. తీరే సమస్య తీరుతుంటే మరలా క్రొత్తది వచ్చి నెత్తిన పడుతుంటుంది. అన్ని సమస్యలూ తీరటమంటూ ఎప్పటికీ సంభవం కాదు. తీరే వరిస్థితే ఉంటే ఇంతకాలం నుంచీ మనమింత నాగరికత గడించినందుకది ఎప్పుడో తీరిపోవలసింది. ఏదీ నాగరికత పెరిగే కొద్దీ సమస్య కూడా దానితోపాటు పెరగటమే గాని తరగటం లేదే. దీనిని బట్టి సాపేక్షమైన మన లౌకిక విద్యలలో సమస్యకు పరిష్కారమే లేదని స్పష్టమవుతున్నది. మానవుడి సమస్యనే తీర్చలేనిదది విద్య ఎలా అయింది. కనుకనే ఈ శాస్త్రాలూ, కళలూ, అసలు విద్యలే గావు.
Page 13