మనసు భావన చేయాలంటే ఏదో ఒక గుణముండాలి పదార్థానికి. ప్రస్తుత మీ ఆత్మ అనే దానికే గుణమూ లేదు. ఎలా భావించగలదు మనస్సు అదే చిత్రం. ఆత్మకే గుణమూ లేదని చెప్పినా దాన్ని మన మతిసూక్ష్మము, అతివిశాలమూ, అతిస్వచ్ఛమూ అని వర్ణిస్తున్నాము. కాబట్టి ఇవే గుణాలని భావించవచ్చు దానికి. గుణాలు కాని గుణాలివి. ఇవి కూడా నిర్విశేషమే కాబట్టి ఇవే గుణాలని భావించవచ్చు దానికి. గుణాలుకాని గుణాలివి. ఇవి కూడా నిర్విశేషమే కాబట్టి సత్తనే Existance ఒకే ఒక సామాన్య గుణంలోనే చేరిపోతాయి. పోతే అది సర్వవ్యాపకమయిన గుణం. కాబట్టి తద్ద్వారా ఆత్మనొక్క ఆకాశంలాగా భావన చేయవచ్చు. భావన అనేసరికి చిద్రూపమైన Conscient మనసు సద్రూపమైన Existant ఆకాశంతో చేతులు కలుపుతుంది. శుద్ధమైన సచ్చిత్తులే గదా బ్రహ్మమంటే. కాబట్టి మనసుకు బ్రహ్మాకారవృత్తి ఏర్పడటంలో అభ్యంతరం లేదు. కనుకనే అంతరమైన ఈ మనస్సూ బాహ్యమైన ఆకాశమూ ఇవి రెండే బ్రహ్మతత్వాన్ని పట్టుకోటానికి చక్కని ప్రతీక Aids లని చెబుతారు భగవత్పాదులు.
ఇంతకూ మనస్సు భౌతికమైన నామరూపాలనెలా భావన చేయగలదో అలాగే అభౌతికమైన సచ్చిత్తులను కూడా భావించగలదు. ఆకాశరూపంగా భావించటమే సచ్చిత్తులను భావించటం. సచ్చిత్తులే బ్రహ్మతత్త్వం. కాబట్టి వాటిని భావించిందంటే మనస్సు - బ్రహ్మతత్త్వాన్ని భావించినట్టే. బ్రహ్మ గుణాలను భావిస్తూ పోతే మనసు బ్రహ్మమే అవుతుంది. "బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి.” ఏది భావిస్తే ఆ రూపంగా పరిణమించటమే గదా మనసుకుండే స్వభావం. వననదీ పర్వతాదులను భావించినప్పుడాయా రూపాలుగా ఎలా భాసిస్తుందో అలాగే సచ్చిదాత్మకమయిన తత్త్వాన్ని భావించేటప్పుడు కూడా భాసించి తీరాలి. అందులో లౌకిక పదార్ధాలను భావించినప్పుడది సవికల్పమయితే బ్రహ్మతత్త్వాన్ని భావించేటపుడు కేవలం నిర్వికల్పమవుతుంది. రెండు విధాలుగా మారిపోయే యోగ్యత దానికెంతైనా ఉంది.
ఇలాంటి ద్వైవిధ్యం Duplicity దాని స్వభావంలోనే ఉండటం మూలాన బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించటానికి మనసనేది ఏ మాత్రమూ పనికి రాదని ఒక మాటా మనసు తప్ప వేరొక సాధనమే లేదని మరొక మాటా-రెండు మాటలూ చెలామణిలోకి వచ్చాయి. “యన్మనసాన మనుతే” అనీ “మనసై వేద మాప్తవ్య” మనీ రెండు భావాలనూ శాస్త్రమే మనకు బోధిస్తున్నది.
Page 125