ఈ విధంగా అపవాదంతో కూడిన అధ్యారోప మీ శాస్త్రకృతమైన అధ్యారోపం. కనుకనే లౌకికమైన సహజారోపణ వంటిది కాదిది. మీదు మిక్కిలి దానిని కొట్టివేసే అధ్యారోపమిది. ఎంచేతనంటే సహజం గనుక జన్మ జన్మలనుంచీ అది ఈ ప్రపంచాన్ని తెచ్చి మనమీద పడవేసింది. పైగా జ్ఞానాన్ని ప్రసాదించకపోవటం మూలాన ఆ నెత్తిన బడ్డ ప్రపంచభారాన్ని క్రిందికి దించుకొనే అవకాశమే లేకుండా చేసింది మనకు. కాబట్టి అది మన కాజన్మ శత్రువులాంటిదా అధ్యారోపం. మరి ఈ శాస్త్రీయమైన దలాంటిది కాదు. ఇది ఆ శత్రువును నిర్మూలించి మనకు మేలు చేసే పరమ మిత్రుడు. ముల్లు తీయటానికి మరలా ఒక ముల్లు నుపయోగిస్తాము మనం. ఆ ముల్లు తీసిన తరువాత దానినీ దీనినీ రెంటినీ కలిపి అవతల పారవేస్తాము. దానితో వేదన తొలిగిపోయి పాదం దానిపాటికది హాయిగా ఉండిపోతుంది. అలాగే బంధహేతువైన అధ్యారోపాన్ని కొట్టి వేయటానికి వేరొక అధ్యారోపాన్ని తెచ్చిపెట్టాము. అది సృష్టి లయాదులను వర్ణించే నెపంతో ప్రపంచాన్నిచైతన్యంతో ముడిపెట్టి చివర కాచైతన్యంలోనే దాన్ని ప్రవిలయం Dissolve చేసి తానూ ఆ చైతన్యంలోనే లయమవుతుంది. తత్ఫలితంగా చివరకొక ఆత్మచైతన్యమే మనకు దక్కుతున్నది. అంచేత ఈ అధ్యారోపమే మనకు నిజమైన కార్యకారి Useful అధ్యారోపాపవాద రూపమైన ఈ ప్రక్రియ వల్లనే Process or Technique అద్వితీయ బ్రహ్మానుభవానికి మనం నోచుకోగలుగుతాము. అంటే అప్పటికి "తత్త్వమసి" వాక్యం "అహమ్ బ్రహ్మస్మి" అనే అనుభవ వాక్యానికి దారి తీస్తుందని భావం. దానితో సాధకుడు నేనే ఆ బ్రహ్మముననే బ్రహ్మాత్మభావాన్ని చెప్పకుండా స్వానుభవానికి తెచ్చుకోగలడు.
అయితే ఇప్పుడొక ప్రశ్న. ఈ ప్రక్రియ ననుసరించినంత మాత్రాన మనకు బ్రహ్మానుభవం కలగటమేమిటి. అనుభవమనేది వ్యక్తిగత Personal మైన విషయం కదా. అది వాక్య శ్రవణమాత్రం చేత ఎలా కలుగుతుంది. అని సందేహం. ఇలాంటి సందేహం పెట్టుకోపని లేదన్నారు శంకరులవారు. ఎందుకంటే వాక్యమనేది ఒక ప్రమాణమని ఇంతకుముందే పేర్కొన్నాము మనం. ప్రమాణమని ఎప్పుడన్నామో అప్పుడది మనకు ప్రమను కలిగించి తీరాలి. ప్రమ అంటే జ్ఞానం.
Page 118