అంటే అవుతున్నావని అర్థం. అంటే ఏమన్నమాట. ఈ జీవుడా ఈశ్వరుడేగాని అంతకన్నా ఏ మాత్రమూ భిన్నంకాడని బోధిస్తున్నదీ వాక్యం. అయితే భిన్నమనే అభిప్రాయమే మనకు లేకుంటే కాదని బోధించటం దేనికి. ఒక విషయం ప్రాప్తిస్తూ ఉన్నప్పుడే దాన్ని మనం కాదని ప్రతిషేధించవలసింది. అలా కాకపోతే అనవసరంగా మన ములిక్కిపడి నట్టవుతుంది. దీనిని బట్టి జీవేశ్వరులకు భేదముందనే ఆశంక అంతకుముందు మనకందరికీ మనసులో పాదుకొని ఉండాలి. అలా ఉండటం మూలాన్నే దానిని కాదని కొట్టివేస్తూ అభేదాన్ని ప్రతిపాదిస్తున్నది శాస్త్రం.
ఈ కొట్టివేయటానికే అపవాద Refutation or Elimination మని నామకరణం చేశారు వేదాంతులు. అపవాదమన్నా-నిషేధమన్నా - బాధఅన్నా- అంతా ఒక్కటే. జీవుణ్ణి ఈశ్వరుడేనని ప్రతిపాదించటంవల్ల జీవుడిలో ప్రస్తుతం కనిపించే జీవ భావాన్ని అపవదించి నట్టవుతున్నది. జీవుడంటే అసలఖండమైన చైతన్యమే గదా. ఆ చైతన్యమవికృతంగానే Unaltered శరీరంలో ప్రవేశించి జీవుడనే పేరుతో వ్యవహరించబడుతుందని ఇంతకు ముందే పేర్కొన్నాము. కాబట్టి చైతన్య స్వరూపుడే జీవుడంటే. ఎటు వచ్చీ శరీరాదికమైన ఉపాధి ప్రపంచమొకటి చుట్టూ వచ్చి చేరటం మూలంగా ఆ చైతన్యం పరిచ్ఛిన్నమై దానికి జీవుడని పేరు వచ్చింది. ప్రపంచమనే ఉపాధి తొలగితే చాలు. వెంటనే అది అపరిచ్ఛిన్నమైన బ్రహ్మచైతన్యంగానే అనుభవానికి వస్తుంది. కాబట్టి జీవత్వానికి హేతుభూతమైన ఈ సమస్త ప్రపంచాన్ని అపవదించటమే మనం చేయవలసిన సాధన. అదే ఈ వాక్యం మనందరికీ బోధించే రహస్యం.
అయితే ప్రపంచాన్ని అపవదించటమంటున్నారు. అండ పిండాత్మకంగా ఈ ప్రపంచమెంతో దూరం విస్తరించి ఉన్నది. దీనిని శాస్త్రం లేదని అపవదించిన మాత్రాన అది లేకపోతుందా. ఒకవేళ పోతే మాత్రమెక్కడికి పోతుందది. మనదగ్గర లేదనేగాని మరొకచోటనైనా ఉండక తప్పదు గదా. ఉంటే ఆ మేరకు మరలా బ్రహ్మతత్త్వం సఖండమే అవుతుంది. అది మన కఖండంగా అద్వితీయంగా అనుభవానికెలా రాగలదని ప్రశ్న వస్తుంది.
Page 110