జరిగిపోయిన అధ్యాయంలో మనం బ్రహ్మతత్త్వాన్ని అందుకోటానికి వస్తు తంత్రమయిన జ్ఞానమొక్కటే సాధనమని ఆ జ్ఞానం కూడా శాస్త్ర ప్రమాణైక జన్యమనీ నిరూపించాము. ప్రస్తుత మీ శాస్త్రమనేది ఆ జ్ఞానాన్ని మనెకెలా ప్రసాదిస్తుంది అది మనకా బ్రహ్మతత్వాన్ని ఎలా అందిస్తుంది ఆ ప్రక్రియ Technique ఏమిటి. అని లోతుకు దిగి విచారించవలసి ఉంది.
శాస్త్రమంటే అఖండ బ్రహ్మతత్త్వాన్ని మనకు వర్ణించి చెప్పే వాక్యం. దీనికే మహావాక్యమని పేరు. ఇలాంటి మహావాక్యాలు నాలుగు వేదాలకూ నాలుగున్నాయి. వాటినే ఆయా ఉపనిషత్తుల ద్వారా అవి లోకానికి చాటుతూ వచ్చాయి. అందులో “తత్త్వమసి” అనేది ఒకటీ “అహమ్ బ్రహ్మాస్మి” అనేది ఒకటీ - ఇవి రెండూ చాలా ప్రధానంగా భావిస్తారు వేదాంతులు. ఎంచేతనంటే తత్త్వమసి అనేది ఉపదేశవాక్య Instruction మైతే అహమ్ బ్రహ్మాస్మి అనేది అనుభవ వాక్యం Experience. ఆచార్యు డొకానొక రహస్యాన్ని ఉపదేశిస్తే శిష్యుడది ఫలానా అని అనుభవానికి తెచ్చుకోటమే కదా కావలసింది. అనుభవం కలిగే సరికి సాధన అనేది ఎలాగు సమాప్తమవుతుంది. కాబట్టి ఇవి రెండే వేదాంత శాస్త్రానికంతటికీ ప్రతినిధి రూపమైన వాక్యాలు.
అందులోనూ అనుభవమనేది ఒక ఫలం Result అది మన సాధనమీద ఆధారపడి ఉంటుంది. సాధన లేకపోతే సిద్ధిలేదు. అంచేత సాధన మార్గాన్ని బోధించే
తత్త్వమసి వాక్యమే రెండింటిలోనూ ప్రప్రథమంగా మనం విచారణ చేయవలసిన మహావాక్యమని ఆచార్యులవారి అభిప్రాయం. కనుకనే నేమో సమయం వచ్చినప్పుడల్లా తత్త్వమసి వాక్యార్ధాన్నే తరుచుగా వారు తమ భాష్యంలో సాధకులకు వివరిస్తూ వచ్చారు. తత్త్వమసి అనే వాక్యం మూడింటి సంపుటీకరణం. అందులో తత్-త్వమ్-అసి అని మూడే మూడు మాటలున్నాయి.
Page 109