ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఒక శబ్దాన్ని మన ముచ్చరించామంటే అది దాని అర్థాన్ని మనకు బోధిస్తుంది. ఆ అర్థం మనకంటి కెదురుగా కనిపించవచ్చు, కనిపించక పోవచ్చు. కనిపించక పోయినా కనిపింప జేసే శక్తి ఉందా శబ్దానికి. తద్వారా మన మనో నేత్రానికా అర్థ స్వరూపం సాక్షాత్కరించి తీరుతుంది. అలా సాక్షాత్కరింప జేసే ఒకానొక శబ్దమే ఇప్పుడు మన చుట్టూ పరిచినట్టుగా కనిపించే ఈ ప్రకృతి అంతా. ఇది వైఖరీ రూపమైన వాక్కే ఈ వాక్కు పరమాత్మతో కలిసి ఓత ప్రోతమై ఉన్న దశలో అది పరా. అది ప్రపంచాన్ని సృష్టించాలని పరమాత్మ సంకల్పించినపుడా సంకల్ప రూపంగా పశ్యంతి. అదే సృష్టి కున్ముఖి అయితే మధ్యమ, ఇక సాక్షాత్తుగా సృష్టే జరిగితే వైఖరి. కనుకనే ఈ కనిపించే ప్రపంచ మేదోగాదు వాక్కేనని చెప్పటం. వాక్కే పార్వతి. ఆవిడ ఈ జగత్సృష్టి కంతా మూలభూత అయిన శక్తియే గనుక జగన్మాత.
పోతే ఇక పరమేశ్వరు డెవరు. పార్వతి వాక్కైతే ఆయన ఈ వాక్కు ద్వారా ప్రకాశితమయ్యే అర్థం. అర్థించ బడేదేదో అది అర్థం. అర్థించటమంటే కోరటం. వాక్కు ద్వారా మనం కోరేది దాని అర్థమే గదా. కనిపించే వాక్కు నాధారం చేసుకొని కనిపించని అర్థాన్ని పట్టుకోవాలని మన అన్వేషణ. కనిపించే వాక్కీ చరాచర ప్రపంచమేనని పేర్కొన్నాము. ఇదే ఆలంబనం మనకా అర్థాన్ని అన్వేషించటానికి, ఏమిటా అర్థం. అదే పరమార్థ రూపుడైన పరమేశ్వరుడు. ఈ ప్రపంచం పార్వతి అయితే ప్రపంచాతిగమైన ఆ చైతన్యం పరమేశ్వరుడు. వాగ్రూపిణి అయిన ఈ పార్వతి మనకు గోచరమయినట్టు చైతన్యరూపుడైన ఆ పరమేశ్వరుడు మాత్రం గోచరం కాడు.
మరి అలా గోచరం కానంత వరకూ అది ద్వైతమే గాని అద్వైతం కానేరదు. ఒకటి కనిపించేది మరొకటి కనిపించనిది. కనిపించని ఆ సత్యం పరోక్షంగా ఉండి పోయినంత వరకూ ఈ కనిపించేది ఎంత ప్రత్యక్షమైనా అది పాక్షికమే. పరిపూర్ణం కాజాలదు. పరిపూర్ణత ఆ రెంటినీ కలిపి అద్వైత దృష్టితో దర్శించినపుడే. అలాటి సమ్యగ్దర్శనమే మానవుడికి ముక్తిదాయకం. అందుకోసం ఈ ప్రత్యక్ష రూపిణి అయిన ప్రకృతిని లేదా పార్వతిని పరోక్షరూపుడైన ఆ పరమాత్మతో కలిపి ఏకంగా భావించాలి.
Page 61