#


Index

చిత్రతరంగిణి

చిత్ర తరంగిణి పోతాడు. తలలేదు, తోకలేదు దైవ మాయలకు తెలిసియు దెలియక తిరిగేము మేము - ఏమీ సేయవచ్చు హరి యెలయించే మాయలివి వేమరు నాతని గొల్చి వీడుకొంటగాక ఎరగడు పరసుఖ మీశ్వర నీమాయలను నెరి విచారముల నెగడిన దాక.

జీవుడించుకంత చేత సముద్రమంత - చేవెక్కి పలుమారు చిగిరించీ మాయ చాపల బుద్ధులు సమయని రాసులు - రాపాడీ గడవరాదు వో మాయ

  మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే అనే గీతా సారమంతా ఈ చరణాలలో ప్రతి ధ్వనిస్తుంది. మాయ ఎంత దుర్గమమైనా ఆత్మ విచారణతో దాన్ని దాట వచ్చునట.

  మాయా వాదాన్ని ఒప్పుకొన్నవాడు ప్రపంచ మిథ్యాత్వాన్ని కూడా ఒప్పినట్టే. ద్వైతికీ ప్రపంచం సత్యమేగాని మిథ్యగాదు. అన్నమయ్యలో అద్వైత భావ మెంతగా జీర్ణించిందో గాని అడుగడుగునా జగన్మిధ్యాత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు.

  నటనల భ్రమయకు నామనసా- ఘటియంచు హరియె కలవాడు. ముంచిన జగమిది మోహినీ గజము - పొంచిన యాస పుట్టించేదిది. వంచనల నిజమువలెనే వుండును - మంచులు మాయలే మరునాడు. విశ్వమంతా నిజంగా ఉన్నట్టు కనిపిస్తుందే గాని నిజానికిది లేనిదే. అయితే ఇక ఉన్నదేమిటి? యెందును శ్రీవేంకటేశ్వరు డుండును డిందు పడగ నిదె తెర మరుగు. ఇందు గల డందు లేడని సందేహం లేకుండా అంతటా ఉన్నదొక వేంకటేశ్వరుడేనట.

  వేంకటేశ్వరుడనే మాట గూడా కబీరుదాసుకు రామశబ్దం మాదిరి అన్నమయ్య కొక ఊతపదమే. ఆయన వేంకటేశ్వరుడు తిరుపతి దేవాలయ గర్భగృహంలో ఉండే ఒక శిలా విగ్రహమేనని భ్రాంతి పడరాదు. హృ-దయము శ్రీవేంకటేశుని నెలవిది. అన్నమయ్యకు శుద్ధమైన మానవ హృదయాలన్నీ భగవన్నిలయాలే. అంతరంగుడును నర్చావతారము - నింతయు శ్రీవేంకటేశ్వరుడే. ఎదుట కనబడే అర్చావతారంలోనే కాదు. అంతరంగంలో కూడా వేంకటేశ్వరుణ్ణి దర్శించ మంటాడు. అంతే కాదు. మొదలను నడుమను ముగిసి నర్థములందు యెదుటను శ్రీవేంకటేశుడట. ఇది యది యననేల - ఇచ్ఛా ద్వేషమేల వెదకుము సమబుద్ధి వివేకమా అంటాడాయన. వేంకటేశ్వరుణ్ణి భూనభోంతరాలంతటా చూడగలిగా డన్నమయ్య. అలా చూడ

Page 56

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు