గలిగాడంటే అది తిరుపతి స్వామి విగ్రహమా లేక సర్వతో వ్యాప్తమైన పరమాత్మ స్వరూపమా. ఆ మాటకు వస్తే ఒక వేంకటేశ్వరుడేమీ - రాముడేమి - కృష్ణుడేమి -అహోబిల నరసింహుడేమి - అన్ని అవతారాలనూ కీర్తిస్తా డన్నమయ్య. ఏ అర్చావతారం మీద ఆయనకు మనసుందో యెవ్వరూ చెప్పలేరు. గట్టిగా నిలదీసి అడిగితే అసలీ అవతారాలే అబద్ధమని చాటటానికి కూడా వెనుదీయడు. అంది చూడగ నీకు నవతారమొకటే - ఎందు వాడవైతివి యేటిదయ్యా అని పలికే సాహసం అన్నమయ్యకు తప్ప ఏ విశిష్టాద్వైతికీ కానరాదు. అంతే కాదు. దీనికి పరిష్కారం ఆఖరి చరణంలో అద్భుతంగా ప్రదర్శిస్తాడు. వేదాంత నిలయా వివిధాచరణా ఆదిదేవ శ్రీవేంకటేశ -సోధించి తలంచిన చోట నే వుందువట ఏదెస నీ మహిమే ఇదేటిదయ్యా. స్వరూపమొక్కటే తక్కినవన్నీ దాని విభూతులేనట. ఇంతకన్నా అద్వైత భావమేమున్నది.
అద్వైత భావమేగాదు. అద్వైత పరిభాషకూడా అన్నమయ్య వుడికి పుచ్చుకొన్నట్టు కనిపిస్తుంది. వరుసల నన్నిటా వన్నె బంగారమే పరి పరి విధముల పలుసొమ్ములైనట్లు వెలయే వేంకటేశ వివిధ జంతువులకు అలవులేని భూమే ఆధారమైనట్లు - ఇలాంటి వన్నీ అద్వైతులు తరుచుగా వాడే దృష్టాంతాలే. జలము లోపల నున్న చందురు నీడవలె- నలు గడల గదలీ నా మనసు పెలుచ మేఘములు గప్పిన సూర్యుని వలె - వెలుగదు నాలోని విజ్ఞానము. ఇలాంటి ఉపమలు కూడ అద్వైతులవే. చిత్తమే పాపము చిత్తమే పుణ్యము - చిత్తమే మోక్షసిద్ధియును. ఇవి కూడా అద్వైతుల పట్టికలోనివే. ఇలా ఎన్నైనా ఉదాహరించవచ్చు.
పోతే ఇక అన్నమయ్య చూపిన సాధన మార్గం కూడా చాలా సూక్ష్మమైనదీ సులభమైనది. ఆచార విచారా లవియు నేనెరగ వాచా మగోచరపు వరదుడ వీవు తపమొక్కటే నాకు దగు నీశరణమట జపమొక్కటే నిన్ను సారెకు నుతించుట కర్మమొక్కటే నీదు కైంకర్య గతినాకు ధర్మమొక్కటె నీదాసాను దాస్యము బలిమి యొక్కటె నాకు భక్తి నీపై గలుగుట కలిమి యొక్కటె నీవు గలవని నమ్ముట యెలమితో శ్రీవేంకటేశ నీవు గతి దక్క పలు బుద్ధులనే బొరలు భావనలే నెరుగ. పలు బుద్ధుల బొరలు భావన లెరుగడట అన్నమయ్య. వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన - అనే గీతలో చెప్పిన అద్వైత సాధన ఇందులో తొంగిచూస్తున్నది అద్వైతుల సాధన అంతా భావనే గాని అనుష్ఠానం కాదు. తుదకు మంచీ చెడ్డా అనే భేదం కూడా లేకుండా సమస్త విశ్వాన్నీ ఏకాకారంగా భావించి లయం చేసుకోవడమే
Page 57