ఉత్తిష్ఠత జాగ్రత
యావ త్స్వస్థ మిదం కళేబర గృహం యావచ్చ దూరే జరా యావచ్చేంద్రియ శక్తి రప్రతిహతా - యావత్ క్షయో నాయుషః ఆత్మశ్రేయసి తావ దేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్ సందీప్తే భవనేతు కూప ఖననం ప్రత్యుద్య మః కీదృశః
మానవుడికి జీవితంలో అన్ని ఆకాశాలూ ఉన్నాయి. శరీర సౌష్ఠవముంది, చక్షురాదులైన జ్ఞానేంద్రియాలున్నాయి. కరచరాణాది కర్మేంద్రియాలున్నాయి, యౌవనముంది. అన్నిటిని మించి ఆయుర్దాయముంది. ఇవన్నీ ఉన్నందుకు వీటిని వ్యర్థం చేసుకోరాదు మానవుడు. ఇవి కేవలం సాధనాలు మాత్రమే. వీటిని ఉపయోగించుకొని చేరవలసిన గమ్యమొకటి ఉంది. సాధనమే గమ్యం కాదు. గమ్యాన్ని చేర్చే సామాగ్రి ఇది. అందుకే శరీర మాద్యంఖలు ధర్మసాధన మన్నారు. ఈ సామాగ్రి మనం ప్రేయస్సుకు ఉపయోగించవచ్చు. శ్రేయస్సుకూ ఉపయోగించవచ్చు. ప్రేయస్సంటే ప్రియమైనది, శ్రేయస్సంటే హితమైనది. ప్రియమైన దానికే అయితే అన్న పానాది భౌతికావసరాలు తీరితే చాలు. తృప్తిపడవచ్చు. అంతవరకే అయితే ఈ మానవజన్మ ఎత్తసక్కరలేదు. పశుపక్ష్యాదులకు కూడా ఉన్నాయవి. వాటికి తోడ్పడే శరీరాది సాధనాలూ ఉన్నాయి.
మరి మానవుడికొక విశిష్టమైన సామాగ్రి ఇచ్చారంటే దానివల్లవాడు సాధించవలసిన ఒక విశిష్ట ప్రయోజనం వేరే ఉండి తీరాలి. ఏమిటది. ప్రేయస్సా, కాదు శ్రేయస్సు. మొదట మంచిగా కనిపించి చివరకు ముప్పు తెచ్చేది ప్రేయస్సైతే, మొదట కష్టంగా తోచినా పోను పోను మనకు హితాన్ని కూర్చేదేదో అది శ్రేయస్సు. ఆత్మశ్రేయస్సే శ్రేయస్సేంటే. మానవుడు తన స్సరూపాన్ని తెలుసుకోగలిగితేచాలు. ప్రపంచమంతా తన విభూతిగా దర్శించగలడు. ఆత్మవత్సర్వ భూతాని అన్నారు. అంతా తన ప్రతిరూపమేనని చూచేవాడికి రాగద్వేషాలు లేవు సరిగదా జరా మృత్యువులు కూడా లేవు. కారణం ఇది నేను, ఇది నేను చూచే ప్రపంచమనే భేదదృష్టి లేదతనికి. చూచే తాను చూడబడే చరాచర పదార్థాలూ సచ్చిద్రూపంగా ఒకే ఒక తత్త్వంగా
Page 172