#


Index

చిత్రతరంగిణి

భావిస్తాడు. ఇలాటి అఖండానుభవంలో జననమరణాదులైన ద్వంద్వాలెలా చోటు చేసుకొంటాయి. అజరామరుడై పోగలడు మానవుడు.

  ఇలాంటి ఆత్మశ్రేయస్సుకు తోడ్పడే భౌతికమైన సాధనమే ఈ శరీరేంద్రియాది కలాపం. ఆ గమ్యాని కనుగుణంగా ఇవి పనిచేసినప్పుడే సార్ధకమివి. భౌతికం గనుక ఇవి ఎంతోకాలముండవు కూడా. నశించే ప్రమాదముంది వీటికి తెలివిగలవాడు అవి నశించే లోపలనే మెలకువ గలిగి వాటిని సద్వినియోగం చేసుకోగలగాలి. చేసుకొంటే సత్ఫలితాన్ని ఎప్పటికైనా పొందకలడు. దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్నారు పెద్దలు. అలా కాకుంటే నిరాశే మనకు మిగిలేది. శరీరమారోగ్యం కోలుపోయి, ముసలితనం ముంచుకువచ్చి, ఇంద్రియ పటుత్వం సడలి, అవసానం కూడా సమీపించినపుడేదో చేద్దామని భావిస్తే అది తెలివితక్కువ. అది ఎలాంటిదంటే ఇల్లు కాలి పోతుంటే చల్లార్చాలని అప్పటికప్పుడొక బావి త్రవ్వటానికి పూనుకోటం లాంటి దంటాడు భర్తృహరి.











Page 173

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు