×
షడ్గుణ/షాడ్గుణ్య : ఆరు గుణాలు, జ్ఞానమూ, ఐశ్వర్యమూ, బలమూ, వీర్యమూ, తేజస్తూ, శక్తీ ఇవి ఆరు షడ్గుణాలు. వీటికే షాడ్గుణ్యమని పేరు. భగమని కూడా దీనికొక నామం. అలాటి భగమున్నవాడే భగవాన్. ప్రవృత్తి, నివృత్తి, భూతసృష్టి, లయమూ, ధర్మమూ, అధర్మమూ ఈ ఆరుకూడా షాడ్గుణ్యమే నంటారు. ఇవి ఉన్నవాడు కూడా భగవానుడే. ఈ ఆరు ఆయనకు నిత్యసిద్ధం.