ఐకమత్య : ఏకమతం తాలూకు భావం. ఒకే మతం అంటే ఆలోచన కలిగి ఉండటం. Agreement among many minds.
×
ఐకాంతిక : ఏకాంతంగా ఉన్నది. ఎప్పటికీ తొలగిపోకుండా ఉండేది. Persistent. Abiding అని అర్థం.
×
ఐకాత్మ్య : ఏకాత్మ భావం. ఒకే ఒక ఆత్మ లేదా స్వరూపం. విజాతీయ గంధం కూడా లేక అంతా సజాతీయంగా ఏకమైన వస్తుస్వరూపం. జీవేశ్వరులకున్న అవినాభావ సంబంధం. రెండూ రెండు ఆత్మలు కావు. రెండూ కలిసి ఒకే ఆత్మ అని సిద్ధాంతం. అద్వైతుల సిద్ధాంతమిదే.
×
ఐక్య : ఏకం యొక్క భావం. ఏకమై పోవటం. Merger. జీవబ్రహ్మైక్యం ఇలాంటిదే.
×
ఐతదాత్మ్య : ఏతదాత్మ భావం. ఇదే ఆత్మ తన స్వరూపమనే భావం. 'ఐతదాత్మ్య మిదగ్ం సర్వం.' ఆ సచ్చిద్రూపమైన తత్త్వమే ఈ ప్రపంచానికంతా స్వరూపం. దీనికంటూ వేరుగా ఒక స్వతంత్ర రూపం లేదని భావం.
×
ఐతిహ్య : ఇతిహాసం. ఇతివృత్తం. కరిరీశిళిజీగి. History. Tradition. ఇది ఇలాగ ఇంతకు ముందు జరిగిందని చెప్పే మాట. కథ. చరిత్ర. వృత్తాంతం. జరిగిన సందర్భమని Past events భావం. ఇది కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు.
×
ఐదంపర్య : ఇదం పర భావం. దీనికి చెందినదనే అర్థం Belonging to this.
×
ఐశ్వర్య : ఈశ్వర భావం. ఈశ్వరత్వం. Mastery. Commanding Nature. అన్నింటినీ లొంగ దీసుకోవడం. ఆధిపత్యం. భగవంతుని షడ్గుణాలలో రెండవది. జ్ఞానం మొదటిది. ఇది దాని తరువాతది. ఈ రెండే చాలు. మిగతా రెండూ కలిసి వస్తాయి. ఇందులో జ్ఞానం Planning ప్రణాళిక. అన్నిటినీ గ్రహించే శక్తి ఐశ్వర్యం Execution అమలుపరచడం. గ్రహించిన ప్రతి ఒక్కటీ అమలుపరిచే శక్తి. ఒకటి జ్ఞానశక్తి. మరొకటి క్రియాశక్తి Omni science and omni potence.
×
ఐంద్రజాలిక : ఇంద్రజాల విద్య ప్రదర్శించేవాడు, గారడీ వాడు Magician, Occultist, ఆకాశంలో గంధర్వ నగరాన్ని సృష్టిస్తాడు వాడు. అది వాస్తవం కాదు. కల్పన. మాయామయం. అలాంటిదే మన జీవితం. ప్రపంచం. ఇది ఒక పెద్ద ఇంద్రజాలమే. దీని కైంద్రజాలి కూడా పరమాత్మే.
×
ఐహిక : ఇహానికి చెందినది. ఇహమంటే ఈ కనిపించే లోకం. దీనివల్ల కలిగే సుఖదుఃఖానుభవాలన్నీ ఐహికం. దీనికి భిన్నమైనది ఆముష్మికం. అంటే Other world పరలోకమని అర్థం.
×
ఐకరూప్య : ఏకరూపమనే దాని భావం Uniformity.
×
ఐతరేయ : ఇతరానికి సంబంధించినది అని అక్షరార్థం. ఉపనిషత్తులలో ఇది ఒకటి. యాజ్ఞవల్క్యుడు క్రక్కితే తిత్తిరి పక్షుల రూపంలో శిష్యులు బయటపెట్టినది తైత్తిరీయం. దానికి ఇతరంగా సూర్యోపాసన చేసి మరలా యాజ్ఞవల్క్యుడు సాధించినది ఐతరేయం. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఇందులోనే కనిపిస్తుంది మనకు. ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు ఇది.