

పోతే ఇక మిగిలినవి రెండే ఒకటి తేజస్సు. మరొకటి జలం. ఇవి రెండూ వాయ్వాకాశాలలాగా అమూర్తం కావు. పృధివిలాగా కలుషితం కావు. చాలా పలచగా సున్నితంగా మృదువుగా కనిపిస్తాయి. అందుకే అగ్నికి పావకమనీ జలానికి తీర్థమనే పేరు వచ్చింది. రెండూ తాము పవిత్రమై మనలను పవిత్రం చేయగలవు. కనుకనే నిత్య నైమిత్తి కాదికమైన ఏ కర్మానుష్ఠానానికైనా ఇవి రెండే ఉపయోగ పడుతుంటాయి. జలంతోనూ అగ్నితోనే ఏ కర్మ అయినా. జలాన్ని మనం మన మీద ప్రోక్షణ చేసుకొంటే మనం పరిశుద్ధులమై పోతాము. అలాగే ఆ ఉపాధి Medium ద్వారా అభివ్యక్తమైన దేవత కూడా అలాగే మనకు కనిపిస్తుంది. అలాటి భావనతో మనమిప్పుడు జలంతో మనలను మార్జనం చేసుకోవాలి. మార్జన మంటే కడుగు కోటమని కల్మషాన్ని పోగొట్టు కోట మనీ అర్థం. అదే ఈ మంత్రం చెబుతున్నది మనకిప్పుడు.
ఆపోహిష్ఠా మయోభువః - తాన ఊర్జే దధా తన - మహేరణాయ చక్షసే యోవశ్శివత మోరసః - తస్య భాజయతేహ నః ఉశతీ రివ మాతరః - తస్మా అరం గమామవో - యస్యక్షయాయ జిస్వథ - ఆపో జనయ ధాచనః -
ఏమిటీ మంత్రాని కర్ధం. ఓ జలాధి దేవతలారా అని సంబోధన. అంటే జలమనే ఉపాధిలో అంతర్యామి రూపంగా ఉన్న ఏ పరాశక్తి ఉందో దాని విశేషాలను సంబోధిస్తున్నాడు సాధకుడు.
Page 44
