#


Index

   అమ్మా మీరే జల రూపంగా అవతరించి కనిపిస్తున్నారు. దేవతే భూతమయి కనిపిస్తుంటుంది. దేవత శక్తి - భూతం దాని బాహ్యమైన రూపం. ఈ రూపంలోనే మీరున్నారు. ఉండి మయోభువః - మాకు సుఖాన్ని ప్రసాదించండి. మిమ్ము మామీద ప్రోక్షణ చేసుకొంటున్నాము. చల్లుకొంటున్నాము. దీని ద్వారా మామీది కావాహన చేసుకొంటున్నాము. తా ఆపః ఆ జలాధి దేవతలైన మీరు నః – మాకు ఊర్జే - ఆహారాన్నీ తద్వారా బలాన్నీ అనుగ్రహించండి. జలం వల్లనే పంటలు పండి మనకాహారం లభిస్తుంది. దానివల్ల శరీర మనోదార్ధ్య మేర్పడు తున్నదని భావం.

   ఈ దేహబలం గాని మనోబలం గాని దేనికి. ఏమిటి దాని ప్రయోజనం. కేవలం బ్రతకటానికేనా. బ్రతకటానికి తిండి తిండి కోసమే బ్రతకటమైతే - ఇక్కడి కిక్కడే సమసిపోతుంది మన జీవితం. జీవిత పరమార్థమందు కొనే అవకాశం లేదు. అంచేత దాన్ని పేర్కొంటున్నా రిప్పుడు మహర్షులు. మహేరణాయ చక్షసే. ఈ మార్జన మెందుకంటే మహత్తరమైన రమణీయమైన దర్శనం కోసమట. అన్నిటి కన్నా గొప్పది బ్రహ్మతత్త్వం. దానినే దర్శించి జన్మసార్ధకం చేసుకోవా లెప్పటికైనా. అందుకే ఈ ఆహారమూ ఈ శరీర పోషణా మనకు.

Page 43