ఉత్తరార్ధమ్
81
నైవ కించి త్కరో మీతి
యక్తామన్యేత తత్త్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్
అశ్నన్ గచ్ఛన్ స్వవన్ శ్వసన్ 5-8
82
ప్రలప న్నుత్సృజన్ గృష్ణ- న్నున్మిష న్ని మిష న్నపి
ఇంద్రియా ణీంద్రియార్థేషు- వర్తంత ఇతి ధారయన్ 5-9
అసలు తత్త్వవేత్త అయిన వాడేపని చేస్తున్నా నేనేమీ చేయటం లేదనే అను కోవాలి. అలా అనుకో గలిగినవాడే నిజమైన తత్త్వవేత్త. తత్త్వ మంటేఏమిటి. అంతా నా స్వరూప మనే గదా. అలాంటి భావమున్న వాడి కా చేసే కర్మ కూడ పరాయి దెలా అవుతుంది. అది కూడా స్వరూపమే. స్వరూప మయి నప్పుడది నిత్య సిద్ధం. దానినిక చేయట మేమిటి. చేశానను కోవటమే చేయటం. అలా అనుకోడు తత్త్వవేత్త. అనుకో గూడదు కూడా.
ఎప్పుడేమి చేస్తున్నా ఏది చేస్తున్నా ఏమీ చేయటం లేదని భావించడానికే ధారణ అని పేరు. ఏమి చేస్తున్నా అంటే ఏమిటది. శాస్త్రీయమైన కర్మ కాండే కాదు. లౌకికమైన శారీరకమైన చేష్టలు కూడా. కనటం-వినటం-తాకటం- మూర్కొనటం- తినటం- తిరగటం- నిద్రించటం- నిశ్వసించటం- పలకటం- విడవటం- పట్టుకోవటం- కనులు మూయటం- తెరవటం- ఒక టేమిటి. ప్రతి నిత్యం చేసే ప్రతి సామాన్యమైన పని కూడా అలాగే భావిస్తూ పోవాలి. ఏమిటా భావన. ఆయా ఇంద్రియాలు ఆయా ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నాయి నాదేమీ లేదనే ఉదాసీనత.