#


Back

ఉత్తరార్ధమ్


78
సక్తాఃకర్మ ణ్య విద్యాంసో యథా కుర్వంతి భారత
కుర్యాద్వి ద్వాం స్తథాసక్త-శ్చికీర్షు ర్లోకసంగ్రహం  3-25

అయితే ఒక్క సందేహం మాత్రమింకా మనలను బాధిస్తూనే ఉంటుంది. అదేమిటంటే ఎంత జీవన్ముక్తుడైనా కర్మ నాచరిస్తున్నంత సేపూ కరచరణా ద్యవయవాల నుపయోగించక తప్పదు గదా. అంతే గాక ధర్మ ప్రచారం చేసేటపుడు- ఎంత కాదన్నా రాగద్వేషాలకు గురిగాక తప్పదుగదా. అలాం టప్పుడు వారికీ మనకూ తేడా ఏముందని ప్రశ్న వస్తుంది.

నిజమే. పైకి చూస్తే తేడా ఏ మాత్రమూ లేదనే తోస్తుంది. కాని ఇది పైకి చూచి చెప్పే వ్యవహారం కాదు. పైకి కనిపించేవి శరీరాద్యు పాధులు. అవి ముక్తుడికీ మనకూ కూడా సమానంగానే ఉన్నాయి ఆకలిదప్పులు కూడా సమానమే. తుదకు దేహపాతంకూడ సమానంగానే జరుగుతూ ఉంది.

అయితే మరి తేడా ఎక్కడ ఉందంటారు. అదే గొప్పరహస్యం. తేడా మరి ఎక్కడా కాదు. ఉభయల దృష్టిలో అనుభవంలో ఉన్నది. యో యచ్ఛద్ధస్స ఏవ సః. దృష్టిలో అనేదే మానవుడు. కర చరణాదులు కావు. కడకు మనః ప్రాణాలు కూడా కావు అవన్నీ ఆత్మకు ఉపాధులు. ఆ ఉపాదులకు సాక్షి అయిన ఆత్మను పట్టుకొన్నాడు జ్ఞాని. ఉపాధులను కూడా ఆ దృష్టితోనే చూస్తున్నాడు. కనుక వాడుముక్తుడు అదివాడి అనుభవమే కాబట్టి ఇతరులకది గోచరంగాదు. అను భవమనేది ఎలా కనిపిస్తుంది. మనకు కలిగే సుఖదుఃఖాదులు కనిపిస్తున్నవా. అనుభవం కూడా అలాగే కనిపించే వస్తువుకాదు. అది వాడి దృష్టి. వాడి దృష్టి కనుకనే అది మన దృష్టికి అంతుపట్టదు. అలా పట్టకపోయే సరికి ముక్తుణ్ణి కూడా మనం మామూలుగానే పరిగణిస్తుంటాము. మన దృష్టితో చూచి మనమాదిరే కదా అని భావిస్తాము. మనమంతా అవిద్వాంసులు. అంటే ఆత్మ జ్ఞానంలేని సామాన్యులం. కనుకనే ఏపనిచేసినా అది నాకు అనుకూలంగానే ఫలించాలని ఎంతో ఆసక్తితో చేస్తుంటాము. ఇలాంటి ఆసక్తితోనే చేస్తాడు ఒక ముక్తుడు కూడా. అయితేవాడు విద్వాంసుడు. అంతా ఆత్మ అనే దృష్టి ఉన్న వాడు. అంచేత వాడికీ వీడికీ ఆసక్తి అనేది ఒకటే అయినా-వీడికది ప్రపంచం మీద. వాడికి దానికధిష్ఠానమైన ఆత్మ మీద, అజ్ఞాని ప్రపంచాన్ని తనకు విలక్ష ణంగా చూస్తూచేస్తాడు. కాబట్టి కర్మవాడికి బంధకం. జ్ఞాని తన స్వరూపంగానే భావిస్తాడు కాబట్టి బంధకం కానేరదు. మీదు మిక్కిలి అది ఒక యాంత్రికంగా జరిగేచేష్ట. అనుషంగికంగా దానికి లోకసంగ్రహమనే ప్రయోజనం కూడా కద్దు.