ఉత్తరార్ధమ్
77
యద్య దాచరతి శ్రేష్ఠ-స్తత్త దేవేత రోజనః
స యత్ప్రమాణం కురుతే లోక స్తదను పర్తతే 3-21
అయితే ఒక ప్రశ్న. వారెంతో జ్ఞానులే కావచ్చు. జీవన్ముక్తులే కావచ్చు. వారు ప్రచారం చేసినంత మాత్రాన లోకులందరూ దాని నందు కోగలరా. అందుకొని బాగు పడగలరా. సామాన్యులైన ప్రజలకంత గొప్పస్థాయి కెదిగే స్తోమత ఉండవద్దా అని ప్రశ్న.
ఇది కూడా మనం సందేహించ నక్కరలేదు. "గతాను గతికో లోకః” అన్నారు పెద్దలు. లోకులెప్పుడూ స్వబుద్ధితో ముందుకు పోలేరు. వారికెవరో ఒకరు నాయకత్వం వహించి ముందుకు నడిపించాలి. తమ నాయకులేది ఆచరిస్తే దాని ననుసరించి మెలగటం వారికి పరిపాటి.
అంతే కాదు. మంచికో చెడ్డకో వారేది సిద్దాంత మని నిర్ణయిస్తారో-అది దాటి చిన్న మెత్తుకూడా అవతలికి పోరులోకులు. అక్షరాల దాని ననుసరిస్తారు. ఇలాంటి గురత్వమూ అనుసరణ స్వభావమూ లోకుల కుండటం మూలాన్నే ఆచార్య పురుషులూ వక్తలూ వారికి గొప్ప గొప్ప విషయాలు సులభంగా బోధించ గలిగారు.
కాబట్టి ఒక అధికార మనే కాక లోకులకున్న అనుకరణ బుద్ధినిబట్టి కూడా ప్రచారం చేయవలసిందే మహాత్ములు. అలా చేయటం మూలానా వారికి తమ అనుభవం గట్టిపడుతూ పోతుంది. ధర్మ ప్రచారమూ జరుగుతూ వస్తుంది. లేకుంటే ముముక్షు జనోద్దరణకు మార్గమే ఉండబోదు.