#


Back

ఉత్తరార్ధమ్


68
కర్మేంద్రియాణి సంయమ్య-య ఆస్తే మనసా స్మరన్
ఇంద్రియార్ధాన్ మిమూఢాత్మా- మిధ్యాచార స్స ఉచ్చతే  3-6

కొందరున్నారు ప్రబుద్ధులు. అన్ని వ్యాపారాలకూ స్వస్తి చెప్పి మేము ధ్యాసం చేస్తున్నా మంటారు. కాళ్ళూ చేతులూ నోరూ కదిలించ కుండా కూచున్నా రంత మాత్రమే. కర్మేంద్రియాలు చలించ కుండా కొంత సేపు కూర్చోవచ్చు. అది ఏమంత అసాధ్యం కాదు. అది వారే కాదు సామాన్యులు కూడా చేయ వచ్చు. అయితే అది ఊరక కూచోట మనుకుంటున్నా రది పొరబాటు.

ఊరక కూచోట మంటే మౌసం మౌన మనేది కేవల వాజ్మౌసమే కాదు. దేహ మౌనముంది. వాజ్మౌన ముంది, మనో మౌన ముంది. అందులో కదల కుండా మాట్లాడ కుండా కూచున్నాడంటే రెండుమౌనాలే సాధించాడు. మానవుడు.

కాని మూడవ దొకటున్నది-మనో మౌనం. అది వాడు చస్తే సాధించలేడు. ఊరక కూచున్నాడని పేరేగాని మనసులో వాడికి రైళ్ళు పరుగెత్తు తుంటాయి. ఎన్నో ఆలోచనలు ఎన్నో గొంతెమ్మ కోరికలు. ఇలాంటి వెన్నో గంధర్వనగరాలు మనసులోసృష్టించు కొంటూ బాహ్యానికి సమాధి నిష్ఠు డయినట్లు నటించినా ఏమి ప్రయోజనం. అది వట్టి దాంభికమే అవుతుంది. ఎంచేత. ప్రాపంచిక విష యాలకు దూరంగా కూచున్నట్టు కనిపిస్తున్నాడే గాని మానసికంగా వాడు ధ్యానిస్తూ ఉన్న దావిషయ ప్రపంచాన్నే. అది ధ్యానమెలా అయింది. కేవలం ఒకధ్యానమే అది. మరేదీ గాదు.