పూర్వార్థమ్
సాధక గీత
పూర్వార్థమ్
57
జ్యోతిషా మపితజ్ఞ్యోతి - స్తమసః పర ముచ్చతే
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం-హృది సర్వస్య విష్ఠితం 13-17
కనేకనే అది భావరూపమై గూడా Positive దానికి భిన్నమైన అభావాన్ని Negative సృష్టించగలిగింది. భావం కేవల చైతన్యమైతే అభావమే చరాచర ప్రపంచం. ఇదంతా తమస్సేగాని జ్యోతిస్సు కాదు. తమస్సంటే చీకటి. చీకటి వెలుగుకంటే విలక్షణంగా ఏదో ఒక నల్లని పదార్థంలాగా కనిపిస్తుంది. అది వెలుగును చూడనంతవరకే. చూస్తే అది ఎక్కడా కానరాదు. ఎక్కడా కానరాక ఎక్కడికి పోయినట్టది. ఎక్కడికీ పోలేదు. పోవటానికి కాళ్ళూ చేతులూ లేవు దానికి. అయితే ఏమయిందరి. అది ఒకటి ఉంటేగదా ఏమైనా కావటానికి. వెలుగు తాలూకు అభావమే చీకటి అంటే. భావం లేకపోవటమే అభావం. ఉంటే ఆభావమనే మాట ఎక్కడిది. అదీ భావమే అవుతుంది. అంటే అప్పటికి వెలుగే చీకటన్నమాట. అయితే చీకటిగా చూడటం ప్రతిలోమం. వెలుగుగా చూడటం అనులోమం. అనులోమంగానే చూడాలి మనం. అప్పుడు ప్రతి లోమం కూడా అనులోమంగానే దర్శనమిస్తుంది. ఇదే సత్యమైన దర్శనం.
ప్రస్తుత మీనామ రూపాత్మకమైన జగత్తు కూడ ఒక చీకటి లాంటిదే. చైతన్య మనేది వెలుగైతే ఇది దానికి విలోమంగా ఏర్పడినది చీకటి. దీనిని భేదించాలంటే మరలా దీనిని ఆ వెలుగుగానే భావించాలి సాధకుడు. అంటే నామరూపాల నన్నింటినీ సచ్చి ద్రూపంగానే మార్చుకొని చూడడం నేర్చుకోవాలి. అలా చూడగలిగితే అప్పుడు జ్ఞానమని జ్ఞేయమని తేడా ఉండదు. వెలుగు చీకట్లు ఏకమైనట్టు రెండూ ఏకమై జ్ఞానంగానే పరిణమిస్తాయి. తద్ద్వారా మనమందు కోవలసిన గమ్యం కూడా ఎక్కడోలేదు. అదీ ఈ జ్ఞానమేనని అవగాహన అవుతుంది. దీనికే ఏకాత్మ భావ Subjective one ness మని పేరు.
అయితే ఇది ఎక్కడ ఉంది ఈ భావం. ఎక్కడోకాదు. మానవుడి హృదయం లోనే ఉంది. నేను శుద్ధ చిద్రూపుణ్ణి నేను చూచే సమస్తమూ కూడా చిద్రూపమే అనే భావం నాలో కాక మరెక్కడ ఉంటుంది. ఎక్కడో ఉంటే నేను భావించట మనేది ఎలా పోసగుతుంది. కాబట్టి నాలోనే ఉంది ఆ భావం.