పూర్వార్థమ్
55
సర్వతః పాణిపాదం త-త్సర్వతోక్షి శిరోముఖం
సర్వతః శ్రుతిమ ల్లోకే - సర్వ మావృత్య తిష్ఠతి|| 13-13
ప్రపంచమంతా దాని విభూతి అని ఎప్పుడన్నామో అప్పుడు దానికొక నామమూ— ఒక రూపమూ- ఒక క్రియా- ఇవి మూడూ వచ్చి పడ్డాయి. నామ రూపక్రియ లనేవి వాస్తవంలో లేవు పరమాత్మకు. కాని మనకవి నిత్మమూ దర్శనమిస్తున్నాయి. పరమాత్మతప్ప మరొక్క పదార్ధమే లేనప్పుడివి ఎక్కడివి. ప్రపంచాని వంటావా. అసలు ప్రపంచమే లేదుగదా. మరి దేనివివి అని ప్రశ్న.
ఇది చాలా చిత్రమైన విషయం. బ్రహ్మతత్త్వం తప్ప మరొక్కటి లేదు. ఉన్నది ఒక్కటే. పోతే దానికితోడు ఈ నామరూపాలనేవి కనిపిస్తున్నాయి. కనిపించే వాటిని కాదనలేము. అలాంటప్పుడివి దేనివై ఉండాలి ఈ నామ రూపాలు, ఆ బ్రహ్మానివే అయి ఉండాలి సందేహం లేదు. అంటే అప్పటికే మన్న మాట. మన మిప్పుడు నామరూపాలని ఏవి మనచుట్టూ పరచుకొని ఉన్నట్టు చూస్తున్నామో అవి ఈ ప్రపంచానివి కావు. ప్రపంచమనేది వేరే ఒక పదార్ధముండి దానికి నామరూపాలంటూ లేవు. బ్రహ్మం తాలూకు నామ రూపాలనే ప్రపంచానివిగా భ్రమిస్తున్నాము మనమంతా. అది కేవలం మన భ్రమే. ఎలాంటిదంటే ఇది-మృత్తిక తాలూకు నామరూపాలనే ఘటం తాలూకు వంటూ చూడటం లాంటిది. మృత్తికకు భిన్నగా ఘటమెక్కడ ఉంది. మృత్తిక రూపమే వాస్తవానికి ఘటమనేది. అలాగే పరమాత్మ రూపమే ప్రపంచమనే పేరుతో మనకు కనిపిస్తూ ఉంది.
దీనినిబట్టి పరమాత్మకు కండ్లూ ముక్కులూ చెవులూ కాళ్ళూ చేతులూ ఇలా చిలవలు పలవలు పెట్టి వర్ణించారంటే అది సమంజసమే. ప్రపంచమంతా ఆయన రూపమే అయినప్పుడందులో ఉండే అన్ని హంగులూ ఇక ఆయనవే గదా. ఆయనవే ఇవన్నీ అని చెప్పటంలో ఏమిటి ఉద్దేశ్యం నిజంగా ఆయనకివన్నీ ఉన్నాయని గాదు. ఆ మాటకు వస్తే ఈ నామరూపాదులేవీ లేవాయనకు. అది నిర్గుణమైన తత్త్వం. ఆ తత్త్వానికి బాహ్యంగా మరేదీ లేదు వాస్తవానికి. అయినా ఏదో ఉన్నట్టు చూస్తున్నాము మనం. తత్కారణంగా దీని కధిష్ఠానమైన Base అ తత్త్వం మనకు బాగా దూరమైపోయింది. ఇప్పుడు దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ చూచే నామరూపాలన్నీ ఏవో గావు-దాని విభూతే Manifestationనని దాని కారోపించి చూడాలి మనం. చూస్తే ఈ ఉపాధుల మేరకే నిలిచిపోక మన దృష్టి దీనికి విలక్షణంగా దీనికి మూల భూతమైన ఆతత్త్వాన్ని పట్టుకోగలదు. ఇది పాణి పాడాది సావయవమయితే అది నిరవ యవం. ఇది సాకారమైతే అది నిరాకారం. ఇది ఆవృతమైతే అది అనావృత మయి వీటన్నిటినీ ఆవరించింది. ఇది మనకు విషయమయితే అది అవిషయం. ఇలా అనాత్మ ప్రపంచానికి విలక్షణంగా ఆత్మతత్త్వాన్ని మనం జ్ఞప్తికి తెచ్చు కోటానికీ నామరూపాది వర్ణన మనకు తోడ్పడుతూంది. అనేకత్వాన్ని Analy- sis వర్ణించట మప్పటికి ఏకత్వాన్ని Synthesis గ్రహించటానికే నన్నమాట.