#


Back

పూర్వార్థమ్


54
జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి - యద జ్ఞాత్వా మృతమశ్నుతే
అనాదిమ త్పరమ్ బ్రహ్మ- నసత్తన్నాస దుచ్చతే  13-12

వీరందరూ ఒక ఎత్తు. ఇప్పుడు నాల్గవ వారొక ఎత్తు. వీరు మీ మాంసకులు కారు. యోగులు కారు. ఉపాసకులు కారు. మరి ఎవరు. జ్ఞానులు. వీరు బ్రహ్మాన్ని పరిశుద్దమైన జ్ఞానంగా భావిస్తారు. జ్ఞానమూ అదే-జ్ఞేయమూ అదే వీరి దృష్టిలో, వెదుకుతూపోతే జ్ఞేయం, వెదకి అనుభవానికి తెచ్చుకొంటే అది జ్ఞానం. ఇదే యథార్థమైన దృష్టి. ఎందుకంటే ఇది సృష్టిలో మరి దేనినీ మిగ ల్చటంలేదు. అంతా ఒకే ఒక తత్త్వంగా ప్రతిపాదిస్తున్నది. తన్మూలంగా సాధకుడి కేకాత్మ భావం కుదిరి అది పరిపాకానికి వస్తే అమృతత్వమే సిద్దిస్తుంది.

ఇంతకూ తేలిందేమిటి. సాధకుడు ప్రయత్నించి అందుకోవలసింది మరేదీ కాదు. అఖండమైన జ్ఞానం. దానికే బ్రహ్మమని నామాంతరం. అది ఎక్కడ ఉంది ఎలా ఉందని-అడిగితే పొరబాటు. అది ఉందనీ చెప్పలేము. లేదనీ చెప్పలేము. ఎందుకని. ఉందని మాత్రం చెబితే లేని దదికాదా అని ప్రశ్న వస్తుంది. లేదని చెబితే ఉన్నది మాత్ర మది కాదా అని ఆక్షేపణ వస్తుంది. ఏది చెప్పినా అదిమాత్రమే అయిమరి ఒకటి కాకుండాపోయే ప్రమాదముంది. అందుచేత ఇది కాదని అదీ-అదికాదని ఇదీ-చెప్పామంటే రెండూ అదే అవు తుంది. అలా అయితేనే అది పరిపూర్ణం. కనుకనే అది సత్తనీ సత్తనీ కూడా పేర్కొనలేమని వర్ణించటం.

సదసత్తులను గూర్చి మనం మొట్టమొదటనే చర్చించి ఉన్నాము. ఆ సంద ర్భంలో సత్తనేది జ్ఞానమనీ-అసత్తనే దంతా జ్ఞేయ మనిగడా ప్రతిపాదించాము. జ్ఞేయమని పేరేగాని చివరకది కూడా జ్ఞానవివర్తమే. కాబట్టి సద్రూపమైన జ్ఞానం కన్నా వేరుగాదు. అలాంటప్పుడిక బ్రహ్మతత్త్వాన్ని సదసద్రూపంగా పేర్కొన టంలో తప్పేముంది. అయితే ఎంతవరకంటే సత్తనేది దాని అసలు తత్త్వమైతే అసలైన ఈ జ్ఞేయ ప్రపంచమంతా దాని విభూతి. అంతేతేడా.