పూర్వార్థమ్
47
ఏషా బ్రాహ్మీ స్థితిఃః పార్థ-నైనాం ప్యాప్య విముహ్యతి
స్థిత్వాస్యా మంత కాలేపి-బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి 2-72
ఇలా అధి భౌతికంగా ఆధ్యాత్మికంగా అధి దైవికంగా మూడంతస్తులలోనూ ఉన్నదొకే తత్త్వమని చూడగలగటమే బ్రాహ్మిస్థితి. అన్నింటికీ కడపటి స్థితి ఇది. దీనిని పొందటమే కష్టసాధ్యం జీవితంలో. ఎన్నో జన్మల నుంచీ చేసుకొన్న తపః ఫలమది. కడసారిగా కలుగుతుంది మానవుడికి.
అది కలిగేంత వరకే అన్ని ప్రయత్నాలు. కలిగిన తర్వాత ఇక యత్నం కాదు. ఫలితమే అది ఎలా ఉంటుందని అడిగితే మోహాని వృత్తే అది మోహ మంటే అనాది ప్రవృత్తమైన మానవుడి అజ్ఞానం. దానివల్లనే ఈ సంసార బంధం. తపస్సు లాంటిదది. అది ఈ బ్రహ్మ భావమనే తేజస్సు ముందు విలువ లేక దాని లోనే లీనమైపోతుంది. అప్పుడంతా బ్రహ్మమే. మరొక పదార్ధమే లేదు.
మరొకటి లేకుంటే ఇక ఆభావానికి చలనమంటూ ఉండబోదు. జీవితం లోనూ ఉండదు. మరణంలోనూ ఉండదు. మరణం కూడా చలనమే గదా. జీవుడు చలించి బయటికి పోవటాన్నే మరణ మంటున్నాము. దేశ కాలాదులన్నీ నా స్వరూపమే అని భావించిన బ్రాహ్మీ స్థితిలో అది ఎలా సంభవం. కాబట్టి అంతకాలంలోనైనా ఆ స్థితిలో ఉన్న వాడికంతమే లేదు. అనంతమైన నిర్వాణ సుఖాన్నే చూరగొంటాడు. శరీర మున్నప్పుడు జీవన్ముక్తి రూపమయితే అది- శరీరం తొలగినప్పుడు విదేహముక్తి. అంతే తేడా. మరేమీ లేదు.