పూర్వార్థమ్
42
నాహం ప్రకాశ స్సర్వస్య - యోగ మాయా సమావృతః
మూఢయం నాభిజానాతి - మా మేభ్యః పరమవ్యయం 7-25
అయితే ఇక్కడ ఒక ఆశంక వస్తుంది. జీవేశ్వరు లిద్దరూ చైతన్య స్వరూ పులే. చైతన్యం తప్ప మరొక లక్షణం ఇద్దరిలోనూ లేదని సిద్ధాంతం చేశారు. మహా అయితే జీవ చైతన్య మీశ్వర చైతన్యం కన్నా స్వల్పమైన దైతే కావచ్చు. అది పరిమాణంలోనే గాని వస్తు తత్త్వంలో కాదు గదా. అలాంటప్పుడిది దాని సర్థం చేసుకోలేని దుస్థితి అసలు ఎలా సంభవించిందని ప్రశ్న.
వాస్తవమే. ఎంత స్వల్నమైనా చైతన్యమే గనుక అది సజాతీయమైన ఆ ఈశ్వర తత్తాన్ని గ్రహించి వుడవలసిందే. సందేహం లేదు కాని ఇక్కడ వచ్చిన తిరకాసే మంటే అది దీని పరిధిలోకి రాకుండా మరుగు పడి వుంది. ఏదైనా ఎదట పడితే గ్రహిస్తుందే గాని మరుగు పడితే ఎలా గ్రహించగలదు. అక్కడే పున్నా పట్టుకోలేదు. ప్రస్తుత మీశ్వర చైతన్య మంతటా నిండివున్నా మరుగున పడి జీవుని కేమాత్రమూ గోచరం కావడం లేదు.
అంతటా ఉన్న దెలా మరుగయిందని ప్రశ్న. దాని చుట్టూ యోగమాయ అనే దట్టమైన పొర ఒకటి ఆవరించి వుంది. అది నిత్యమూ అడ్డు తగులుతూ ఉంది లోక దృష్టికి. అందుకే ఎవడంటే వాడు దాన్ని అంత సులభంగా గ్రహించ లేక పోతున్నాడు. గ్రహించే సాధనం మన దగ్గర లేక గాదు. జ్ఞానమే గదా గ్రహించే సాధనం. అది ఎప్పుడూ మన దగ్గర ఉన్నదే. అసలు మన స్వరూపమే అది. అయినా అది ప్రసరించకుండా యోగ మాయ దాన్ని మభ్య పెడుతున్నది. దాన్ని అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని. అదే మన బుద్ధి కుండే గ్రహణ శక్తిని కూడా కుంఠితం చేస్తూంది.
అటు గ్రాహ్యమైన తత్త్వమూ ఇటు గ్రాహకమైన మన జ్ఞానమూ రెండూ దానిచేత ఎప్పుడావృత మయ్యాయో అప్పు డీజ్ఞానమనే సాధనం మనకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దానితో పరమార్ధాన్ని గ్రహించలేని మూఢుల మయ్యాము మనమంతా. అయితే పరమార్ధం మాత్రం మనం గ్రహించినా గ్రహించకున్నా అలాగే ప్రకాశిస్తూ ఉంది. ఎంచేత. అది అజమూ అవ్యయమూ అయిన పదార్థం. కారణమనేది లేనిది కాబట్టి అది అజం. దేనికి కార్యం కాదు కాబట్టి అవ్యయం. అంచేత మరొకదాని కది ఎప్పుడూ వశం కాదు. మాయ కూడా దానికి భిన్నం కాదు కాబట్టి దాని నేమీ చేయలేదు. ఎటువచ్చీ జీవుడికే అది అడ్డు తగులుతూ వుంది. కనుకనే ఎదుటనే ఉన్నా దాన్ని చూ కలేక బాధ పడుతున్నాడీ జీవుడు.