#


Back

పూర్వార్థమ్


40
అంత వత్తు ఫలం తేషాం తద్ భవత్యల్ప మేధసాం
దేవాన్ దేవ యజో యాంతి - మద్భక్తా యాంతి మామపి  7-23

అయితే ఈ దేవతలు మనకు ప్రసాదించా లనుకొనే ఫలితం మాత్రం చాలా పరిమితమైంది. అది ఎంతో కాలం మానవుడి అనుభవానికి వచ్చేది కాదు. ఎప్పుడో ఒకప్పుడు అంతరించేదే. కారణం ఆ ఉపాసకు డఖండమైన చైతన్యాన్ని కాకుండా పరిచ్ఛిన్న మైన Limited మూర్తినే పట్టుకొని కూచున్నాడు. పరిచ్ఛిన మైనది ఇచ్చే ఫలం మాత్రం పరిచ్ఛన్నం కాక పరిపూర్ణ మెలా అవుతుంది.

బుద్ధి బలం తక్కువగా ఉన్న వాళ్ళే ఇలాంటి కోరికలు కోరుతుంటారు. కోరికల కనుగుణంగా ఆయా చిల్లర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అదే బుద్ధి బాగా వికసించిన సాధకుడైతే క్షుద్ర దేవతో పాసనలతో జీవితం వ్యర్ధం చేసుకోడు. అఖండమైన తత్త్వ మేదో దానినే అర్థం చేసు కొనెందుకు ప్రయత్ని స్తాడు. అది ఇక జ్ఞానమే గాని ఉపాసన కాదు.