#


Back

పూర్వార్థమ్


34
తేషాం జ్ఞానీ నిత్య యుక్తః- ఏక భక్తి ర్విశిష్యతే
ప్రియో హి జ్ఞానినో త్యర్ధ- మహం సచ మమ ప్రియః  7-17

మొత్తానికి నాస్తికుల నొకరిని మినహా యిస్తే మిగతా మానవులంతా నాలుగే నాలు గంతస్తులు. వారే ఆర్తాదులు. ఆ ఆర్తాదులు నలుగురిలోనూ జ్ఞానికున్న అంతస్తు చాలా ఉన్నతమైనది. పరమాత్మ స్థాయికీ అతని స్థాయికీ ఏమాత్రం తేడా లేదు. పరిపూర్ణ చైతన్య రూపమే గదా పరమాత్మ అంటే. అలాంటి పరి పూర్ణతనే అందుకొన్నాడు జ్ఞాని కూడ, అందుకే పరమాత్మ అంటే అతని కిష్టం, అతడంటే పరమాత్మకూ ఇష్టం.

అంతేగాదు. పరిపూర్ణమైన జ్ఞాన మప్పుడయిందో అప్పుడదే భక్తీ అవు తుంది. అదే కర్మా అవుతుంది. భజించటమే భక్తి. చేయటమే యుక్తి. జ్ఞాని సమత్వ బుద్ది సంపన్నుడు కాబట్టి ఒకవైపు పరమార్ధాన్ని భజిస్తూనే మరొకవైపు దాని బలంతో కర్మ లాచరిస్తాడు. లేదా కర్మ లాచరిస్తూనే పరమాత్మను సేవిస్తుంటాడు. రెండిటికీ విరోధం లేకుండా జ్ఞాన మనేది కాపాడుతుంటుంది. అది రెండు కొసలూ కలిపే సూత్రం. అపుడు కర్మ భక్తి భావాలు జ్ఞానంలోనే కలిసి వచ్చి అది పరిపూర్ణ యోగ మనిపించుకొంటుంది.