పూర్వార్థమ్
30
దైవీ హ్యేషా గుణమయీ - మమ మాయా దురత్యయా
మా మేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే 7-14
సరే. బాగానే ఉంది. కాని ఈ గుణాలని చెబుతున్నారే ఇవి ఎక్కడివి. ఉన్న దొక్క పరమాత్మ చైతన్యమే గదా. అదే సర్వ వ్యాపక మని గదా వర్ణించారు. అలాంటప్పుడీ గుణా లేమిటి వీటి వల్ల మన బుద్దులు కలుషితం కావట మేమిటని ప్రశ్న.
వాస్తవమే. చైతన్యం తప్ప మరేమీ లేదు. కాని చైతన్య మనేది అశక్తమైనది కాదు. దాని కొకశక్తి ఉన్నది. అది దాని లాగే సర్వత్రా వ్యాపించి ఉన్నది. అయితే చైతన్యం వస్తువు. ఇది దాని ఆభాస. వస్తువు నాధారం చేసుకొని ఉండ వలసిందే గాని అది స్వతంత్రంగా ఉండలేదు. అగ్నికి ఉష్ణ గుణ మనేది ఉన్నదంటే అది ఎప్పుడూ దాని నంటి పట్టుకొనే ఉంటుంది. అలాగే త్రిగుణా త్మకమైన ఒకానొక శక్తి ఆ పరమాత్మ నంటి పట్టుకొని ఉంటుంది. అది ఆ చైతన్యంలోనే అంతర్లీనమయి ఉంది. కావలసి నప్పుడే అది బయటికి వచ్చి కనిపిస్తుంది. దానికి "మాయ" అని పేరు. "మీయతే అనయా ఇతిమాయా". చైతన్యాన్ని నామ రూప క్రియాత్మకంగా కొలత వేసి చూపుతుంది కాబట్టి అది మాయ అయింది.
ఈ మాయా శక్తి కొలిచి పారవేసిన చైతన్య ఖండాలే జరాయు జాదులైన జీవులన్నీ. అది నానా విధాలుగా మార్చి వేసిన చైతన్యచ్ఛాయలే చరా చర పదార్ధాలన్నీ. దాని చేతి మీదుగా జరిగింది. ఈ సమస్త సృష్టిని దాటి పోయే శక్తి లేని దీమానవుని సృష్టి అయితే మనగతి ఎప్పటికీ ఇక ఇంతేనా అని ప్రశ్న. కాదు. ఎప్పటికీ ఇంతే అయితే ఇక జీవుడు తరించే మార్గమే లేదు. మార్గం లేదని చెప్పటానికే అయితే ఇంత శాస్త్రం దేనికి. ఇంత ఉపదేశం చేనికి అనావశ్యకం. కాబట్టి ఉంది. సాధించే మార్గము ఉంది. కాని ఈ త్రిగుణాలతో పోరాడి సాధించేది కాదది ' త్రిగుణాతీతమైన తత్త్వముతో చేయి కలిపేది. తత్త్వాన్ని గట్టిగా పట్టుకుంటే అదే త్రిగుణాల పట్టు వదిలిస్తుంది.
అది ఎలాగ అని అడగవచ్చు. నామరూపాదులే గదా ఎప్పుడూ మన దారి కడ్డు తగిలేది. అలా తగిలితే వాటిని మరలా మన మెదుర్కోటానికి యత్నించ రాదు. ఎదుర్కొనే కొద్దీ అవి ఇంకా ఉదృతంగా వచ్చి నెత్తిన పడతాయి. మరి ఏమి చేయాలి మనం, మనకేది తగులుతున్నా అదంతా నా స్వరూపమే నని భావన చేస్తూ పోవాలి. నిజాని కది మన చైతన్యమేగదా. చైతన్యమే మూర్తీభ వించి మన కావిధముగా కనిపిస్తుంది. అంచేత భావిస్తే అది ద్రవీభవించి మరలా మన చైతన్యం లాగానే దర్శనమిస్తుంది. ఇలాంటి రాజీ మార్గమే సరియైన రాజ మార్గం. దీని మూలంగా అడ్డుకుండానే గుణాల నడ్డి నట్టయింది. గుణా తీతమైన తత్త్వాన్నీ అందుకొన్నట్టయింది.